బెంగళూరు- నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇద్దరిని కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు.
బెంగళూరు- నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇద్దరిని కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. తెల్లవారుజామున 3.10 గంటలకు పుట్టపర్తికి 10 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ- పుట్టపర్తి మధ్య ప్రాంతంలోని కొత్త చెరువు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి 10.30 గంటలకు బెంగళూరు నుంచి నాందేడ్కు ఈ రైలు బయల్దేరింది. ఉన్నట్టుండి తెల్లవారుజామున బి-1 ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఆ బోగీలో మొత్తం 57 మంది ప్రయాణిస్తున్నారు.
కాగా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రైళ్లలో భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.