26కు పెరిగిన మృతుల సంఖ్య | Nanded Express catches fire, Death toll rises to 26 | Sakshi
Sakshi News home page

26కు పెరిగిన మృతుల సంఖ్య

Published Sat, Dec 28 2013 11:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

26కు పెరిగిన మృతుల సంఖ్య - Sakshi

26కు పెరిగిన మృతుల సంఖ్య

అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం డీఎన్ఏ పరీక్షల నిమిత్తం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరస్తున్నారు. పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. కాగా ఇప్పటివరకూ రెండు మృతదేహాలను గుర్తించారు. ఆదోనికి చెందిన సర్వ మంగళం, బస్వరాజులను బంధువులు గుర్తించారు. ఇక మృతదేహాల్లో 12మంది మహిళులు, 12 పురుషులు, ఓ చిన్నారిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు  జిల్లా ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది... సహాయకచర్యల్లో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీయడంతో పాటు క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్పించడంలో నిమగ్నమయ్యారు. దాదాపు నాలుగు గంటల ప్రయత్నం తర్వాత ఫైర్ సిబ్బంది ప్రయత్నం ఫలించింది. బీ-1 బోగీలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement