అనంతపురం: నాందేడ్-బెంగళూర్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేపడతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జునఖర్గే పేర్కొన్నారు. ప్రమాద ఘటనాస్థలాన్ని శనివారం కేంద్ర రైల్వేశాఖా మల్లికార్జునఖర్గే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బాధితులను అన్నివిధాలా అదుకుంటామని మల్లికార్జునా ఖర్గే హమీ ఇచ్చారు.
కాగా, అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున నాందేడ్-బెంగళూర్ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీ బి వన్లో మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారుల సహా 26మంది సజీవదహనమైయ్యారు. అకస్మాత్తుగా మంటలు ఒక బోగీ నుంచి రెండో బోగీకి వ్యాపించడంతో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. ఈ రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం.
ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేపడతాం: మల్లికార్జునఖర్గే
Published Sat, Dec 28 2013 4:43 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement