నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మృతుల వివరాలు
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ బసవరాజు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటల్లో కాలిబూడిదైపోయారు. ఆయనతో పాటు కూతురు సర్వమంగళమ్మ, కూడా రైల్లోని మంటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సర్వమంగళం కౌతాళంలో టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రమాదం నుంచి బసవరాజు భార్య అన్నపూర్ణమ్మ, పెద్దతుంబళం గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న అల్లుడు చరణ్, ప్రాణాలతో బయటపడ్డారు.
బసవరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు తమ కొడుకుకు పెళ్లి సంబంధం చూడటానికి బెంగళూరు వెళ్లి తిరిగి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. ముంబైకి చెందిన అనిల్‌కుమార్, బెంగళూరుకు చెందిన మధు, రాంప్రసాద్, అనిల్ కులకర్ణి, లలిత, పద్మజ విగత జీవులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన గణేశ్ కూడా మంటల్లో చిక్కుకుని తుదిశ్వాస విడిచారు. అనంతపురం, ధర్మవరం ఆసుపత్రుల్లో చెన్నైకు చెందిన విజిత, తునుశ్రీ, నతేష్, మైసూర్ వాసి విజయ, బెంగళూరు నివాసి తనూజ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 26మంది సజీవ దహనం కాగా, మరో 15మంది గాయపడ్డారు.
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద మృతులు
ఆదోనికి చెందిన బసవరాజు
ఆదోనికి చెందిన సర్వమంగళమ్మ
ముంబైకి చెందిన అనిల్‌కుమార్
బెంగళూరుకు చెందిన మధు, రాంప్రసాద్
బెంగళూరు వాసులు అనిల్కులకర్ణి, లలిత, పద్మజ
హైదరాబాద్‌కు చెందిన గణేశ్
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ క్షతగాత్రులు
చెన్నైకు చెందిన విజిత, తునుశ్రీ, నతేష్
మైసూర్ వాసి విజయ
బెంగళూరు నివాసి తనూజ