అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో షార్‌ట సర్క్యూట్ జరిగిన బీ1 బోగీలో అగ్నికీలలు ఎగిసిపడినా శుభలేఖలు చెక్కుచెదరలేదు. అయితే వీటిని పంచేందుకు తీసుకెళుతున్న వారు మరణించారా.. గాయాలతో బయటపడ్డారా అన్నది తెలియడం లేదు. బెంగళూరుకు చెందిన శాంతిలాల్, శకుంతలబాయి దంపతుల కుమార్తె స్మితకు, నాందేడ్‌కు చెందిన కన్హేలాల్‌జీ పురోహిత్, మనూదేవి దంపతుల కుమారుడు నిఖిల్‌కి వివాహం నిశ్చయమైంది.
శుభలేఖలు పంచేందుకు బెంగళూరు నుంచి వధువు కుటుంబ సభ్యులు బయల్దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం వల్ల 26 మంది వృతి చెందగా, పలువురు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బోగీ బయట శుభలేఖలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి పలువురు అయ్యయ్యో.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సేపు అవి అక్కడే ఉన్నప్పటికీ వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. దీంతో ఆ పెళ్లి పత్రికల సంబంధీకుల ఆచూకీ తెలియరాలేదు. వారు క్షేమంగా బయట పడాలని అక్కడ వాటిని చూసిన వారందరూ కోరుకున్నారు.
అయ్యయ్యో.. శుభలేఖలు
Published Sun, Dec 29 2013 4:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement