సర్వజనాస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌ | short circuit in government hospital | Sakshi
Sakshi News home page

సర్వజనాస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌

Published Fri, Nov 11 2016 1:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

సర్వజనాస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌ - Sakshi

సర్వజనాస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌

అనంతపురం మెడికల్‌ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గురువారం సాయంత్రం షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో రోగులు బెంబేలెత్తారు. కాన్పుల వార్డులో సిజేరియ¯ŒS చేసిన తర్వాత బాలింతలను ఉంచే గదిలో ఉన్న స్విచ్‌బోర్డులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో వారికి తోడుగా గదిలోనే ఉన్న బంధువులు భయాందోâýæనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక బయటకు పరుగుతీశారు. అప్పటికే వార్డులో ఐదుగురు బాలింతలు ఉన్నారు.

అంతలోనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి కరెంట్‌ సరఫరా నిలుపుదల చేశారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎంఓ వైవీ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. బాలింతలను మరో వార్డుకు తరలించారు. కాగా ఆస్పత్రిలో వైరింగ్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement