అనంతపురం: సాంకేతిక లోపం కారణంగానే నాందేడ్-బెంగళూర్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఈ రైలు అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత బి ఒన్ ఏసి కోచ్లో మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో 21 మంది పెద్దవారితోపాటు ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. ఈ ప్రయాణికులందరూ గాఢ నిద్రలోనే మృత్యు వడిలోకి వెళ్లిపోయారు. బోగి పూర్తిగా కాలిపోయింది. కొంతమంది కాలిబూడిదయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నట్లు స్థానికలు చెబుతున్నారు.
ప్రమాదం విషయం తెలియగానే అనంతపురం రేంజ్ డిఐజి బాలకృష్ణ, కలెక్టర్ లోకేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదం ఈ తెల్లవారుజామున 3.25 గంటల ప్రాంతంలో జరిగినట్లు డిఐజి బాలకృష్ణ చెప్పారు. ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేస్తోందని కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు.
మంత్రి రఘువీరా రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు: 080-22354108/ 22251271
పుట్టపర్తి ప్రశాంతి నిలయం : 08555-280125
సాంకేతిక లోపం కారణంగానే రైలు ప్రమాదం
Published Sat, Dec 28 2013 7:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement
Advertisement