ఒక్క క్షణంలోనే...
సోమవారం వేకువజాము 2.30 గంటలకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు మంచి నిద్రలో ఉన్నారు. అదే సమయంలో భయకరమైన శబ్ధంతో 25 టన్నుల బరువైన గ్రానైట్ రాయి ఏసీ ఫస్ట్‌క్లాస్ బోగీలోకి వచ్చిపడింది ఏం జరిగిందో గుర్తించే లోపు ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనలో దేవదుర్గ ఎమ్మెల్యే, గిరిజన నేత అరికేర వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆ దెబ్బకు రైల్వేట్రాక్‌లోని స్లీపర్లు పగిలిపోయాయి.
కుదుపులకు మూడుబోగీలు పట్టాలు తప్పాయి. రైలుమొత్తం 500 మీటర్ల మేర అదుర్లతో ప్రయాణించింది. చిమ్మచీకట్లో బాంబు పేలిన శబ్దం... కుదుపుల ప్రయాణంతో అసలు రైలులో ఏం జరిగిందో? ప్రయాణీకులకు అర్థం కాలేదు. పట్టాలు తప్పిన బోగీలు కిందకు పడిపోకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
- బెంగళూరు