నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర ్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు.
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర ్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడా.. ఆరు నెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశావా అంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు.
బెంగళూరు నుంచి బయలుదేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం 26 మంది పాలిట మృత్యు శకటంగా మారింది. ఈ ఘోర ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగిల్చింది. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు నగరంలోని విక్టోరియా ఆస్పత్రి వద్దకు చేరుకొని ‘దేవుడా ఎందుకిలా చేశావ్, ఎందుకు మా కింత శిక్ష విధించావంటూ’ విలపిస్తుంటే వారిని చూస్తున్న వారి కళ్లు కూడా చెమర్చాయి.