తమ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్న సోనియా గాంధీకి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలుసా అని అడిగారు. వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. చీలికవాదం తెలంగాణకు హానికరమని రావి నారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జగన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం విభజించిన తర్వాత ఇక్కడి ఆస్తుల విలువలు పడిపోతే ఆ విలువ సోనియా ఇస్తారా, చంద్రబాబు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. భారతదేశ పౌరసత్వం తీసుకున్న వారిని ఇటలీకి తిరిగి వెళ్లిపోమంటే ఒప్పుకుంటారా అంటూ అడిగారు. 30 ఏళ్లుగా ఉంటున్న సోనియాకే భారతదేశంపై ఇంత అధికారం ఉంటే వందల ఏళ్లుగా ఉంటున్న తమకు ఎంత అధికారం ఉండాలని సూటిగా ప్రశ్నించారు. ఈ మాట అంటే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారని జగన్ ఎద్దేవా చేశారు. ఓట్ల, సీట్ల కోసం విభజించే రాజకీయాలు తెరమరుగు కావాలని ఆకాంక్షించారు. సోనియా గుండెలు అదిరేలా, కిరణ్-చంద్రబాబు గూబలదిరేలా సమైక్య గళాన్ని వినిపించాలన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా అంటూ సభలోని వారిని జగన్ ప్రశ్నించగా 'నో' అనే సమాధానం వచ్చింది. విభజన బిల్లు ఆపే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ పోరాడుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం, ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నేతనే ప్రధానిని చేద్దామన్నారు. జగన్ ప్రసంగంలో హైలెట్స్ వైఎస్ జగన్ వేదికపైకి రాగానే ఈలలు, కేకలతో సభా ప్రాంగణంలో ప్రజల ఉత్సాహం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములుచ బూర్గుల కృష్ణారావు చిత్రపటానికి జగన్ పుష్పాంజలి వైఎస్‌ఆర్ విగ్రహానికి జగన్ నివాళి వేదికపై నాయకులకు పేరు పేరునా పలకరించిన జగన్ సభాధ్యక్షుడు కొణతాల రామకృష్ణ ప్రారంభోపన్యాసం తర్వాత వైఎస్సార్ సీపీ, సమైక్యవాదుల ప్రసంగాలు ప్రసంగానికి ముందు శంఖం పూరించిన జననేత భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన జగన్ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తరలివచ్చిన జనానికి జగన్ ధన్యవాదాలు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ కోసం ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నా రాజకీయ చదరంగంలో పావులం కాదు అన్యాయం చేస్తే ఊరుకోం వందేమాతర గేయాన్ని, విప్లవ జెండాను అందుకుంటాం.. మిమ్నల్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం పేదవాడికి మేలు చేయడమే రాజకీయం తినడానికి తిండి లేకపోయినా జీతాన్ని పక్కనపెట్టి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమబాట పట్టాడు పనివాడు అక్కచెల్లెళ్లు చంటిబిడ్డలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి తమ బిడ్డల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తూ ఉద్యమించారు ఇంతమంది ఎందుకు ఉద్యమం చేస్తున్నారని రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుని ప్రధాని చేయాలనుకుంటున్న సోనియాకు తట్టలేదు ప్యాకేజీ లు కోరుతున్న చంద్రబాబుకూ తట్టలేదు, మోసం చేస్తున్న సీఎం కిరణ్‌కు తట్టలేదు ఈ నాయకులందరినీ నీళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా ఆల్మట్టి,నారాయణపూర్ నిండనిదే కిందకు నీళ్లు ఎలా వస్తాయని ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురినీ ప్రశ్నిస్తున్నా కర్ణాటక, తమిళనాడు ప్రతియేటా నీటి కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి తెలియదా? ట్రిబ్యునళ్లు, బోర్డులు ఏం చేయగలిగాయో తెలియదా? రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయి? మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లకు ఎక్కడ నుంచి నీళ్లు ఇస్తారు? నల్గొండ ఎస్‌ఎల్‌బీసీకి ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయి? గాలేరునగరి, హంద్రీనీవాలకు నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారు? కృష్ణా ఆయకట్టులో రైతులు కొట్టుకునే పరిస్థితి రాదా అని ప్రశిస్తున్నా? పోలవరం ప్రాజెక్ట్‌కు నీళ్లు ఎలా తీసుకొస్తారు? కళ్లార్పకుండా ప్రజలను మోసం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లు సమాధానం చెప్పాలి హైదరాబాద్‌ను 10ఏళ్లలో విడిచి వెళ్లమంటున్నారు చదువు పూర్తైన యువకులు సోనియా, బాబు, కిరణ్‌లను ఉద్యోగం కోసం కాలర్ పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఏ రాష్ట్రం బాగుపడాలన్నా మహానగరంలో సముద్ర తీరాలు ఒక్కటిగా ఉండాలి. అలా అయితేనే పెట్టుబడులు వస్తాయి. వైఎస్ ఉన్నప్పుడు క్యాంపస్ ద్వారా ప్రతియేటా 50వేల ఉద్యోగాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆ సంఖ్య 25వేలకు మించడం లేదు. దేశంలోనే హిందీ తర్వాత అతిపెద్ద జాతి తెలుగుజాతి సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా? నాది వీర తెలంగాణే తప్ప.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి సోనియాకు తెలుసా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎదురైన పరిస్థితి రేపు దేశంలో కూడా వస్తుందని హెచ్చరిస్తున్నా తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా? 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం.. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం.. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర, జై వైఎస్‌ఆర్ అంటూ ప్రసంగాన్ని ముగించిన జగన్
Published Sat, Oct 26 2013 5:53 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement