burgula ramakrishna rao
-
రెండోసారి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి పదవి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు.. సామాన్య కుటుంబంలో జని్మంచిన వ్యక్తి. సడలని పట్టుదల, అకుంఠిత దీక్షతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఉమ్మడి పాలమూరు కీర్తిపతాకాన్ని మరోమారు రెపరెపలాడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రాభవాన్ని కోల్పోయి అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు అలుపెరగని పోరాటంతో ఊపిరిలూదిన ఎనుముల రేవంత్‌రెడ్డి. రాష్ట్రంతోపాటు కేంద్రంలోని అధికార పారీ్టలపై పదునైన విమర్శలు, ఉద్వేగపూరిత ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. హస్తం గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో మార్పు రావాలి అనే నినాదంతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే పార్టీని అధికార బాట పట్టించారు. నల్లమల అటవీ పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జని్మంచిన ఆయనను సీఎంగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బూర్గుల తర్వాత మళ్లీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారెడ్డి 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైహైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 71 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో సీఎం మనోడే అంటూ ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి , ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. రైతు కుటుంబం నుంచి.. వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులది సాధారణ రైతు కుటుంబం. వీరికి ఏడుగురు మగ, ఒక ఆడ సంతానం. 1967 నవంబర్ 8న రేవంత్‌రెడ్డి జన్మించారు. రేవంత్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో కొనసాగింది. ఆరో తరగతి కల్వకుర్తి మండలం (అప్పుడు వెల్దండ) తాండ్రలోని ఉన్నత పాఠశాలలో చదివారు. ఏడు నుంచి పదో తరగతి వరకు వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటరీ్మడియట్ వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.. డిగ్రీ (బీఏ ఆర్ట్స్) హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో చదివారు. జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేశారు. రేవంత్‌రెడ్డికి భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి ఉన్నారు. ఈ అవకాశం మళ్లీ రాదంటూ.. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులు ఉన్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారు. ఇది పాలమూరు గడ్డ గొప్పతనం. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్లకు మళ్లీ మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చేజారితే ఈ అవకాశం రాదు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి కొందరు, గల్లీ నుంచి మరికొందరు గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారు. పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురుతిరగాలి. – రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ తర్వాత అనతికాలంలోనే.. 2021లో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సుమారు రెండేళ్లుగా పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ అగ్రనేతల సహకారంతో, ఐకమత్యంతో పార్టీని ముందుకు నడిపిస్తూ.. నిరి్వరామంగా ప్రజల్లో ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చారు. అనతి కాలంలోనే తన సవాల్‌ను నెగ్గించుకోవడమే కాకుండా.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అవుతున్నారు. జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి.. రేవంత్‌కు చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో 2004లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లో చేరి కొంతకాలం పనిచేశారు. 2006లో మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యరి్థగా స్వతంత్రంగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్ శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2009, 2014లో కొడంగల్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ‘ఓటుకు నోటు’తో మలుపు.. తొలి నుంచీ దూకుడే.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. 2015 మే 15న రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది తనతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అఖండ మెజార్టీ వచ్చేలా చేసి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రేవంత్ తొలి నుంచీ దూకుడుగానే ముందుకు సాగారు. పదునైన విమర్శలు..ఉద్వేగపూరిత ప్రసంగాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పదునైన విమర్శలు, ఉద్వేగపూరిత ప్రసంగాలే కాదు.. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే అమలు చేయడం ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రత్యేకత. చిన్న నాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచి గెలిచిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. ఒక సారి ఎమ్మెల్సీ, ఒక దఫా ఎంపీ, ఇప్పటితో కలిపి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. అయినా పట్టుదలతో టీపీసీసీ చీఫ్‌గా అనతికాలంలోనే కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపి.. పార్టీని ముందుండి నడిపించారు. తాను బరిలో నిలిచిన కొడంగల్‌లో నామినేషన్‌కు ఒక రోజు, రోడ్‌షోకు మరో రోజు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ సభకు ఇంకో రోజు.. ఇలా కేవలం మూడు సార్లు మాత్రమే ప్రచారానికి వచ్చిన రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో 83 ప్రచార సభల్లో పాల్గొన్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీలపై తూటాల్లాంటి మాటలు, విమర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా.. ఉద్వేగ ప్రసంగాలతో ప్రజల మనసు దోచుకుని కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న తీపిగుర్తులు, ప్రసంగాల తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎస్.. ఢీ అంటే ఢీ.. నల్లగొండలో నిర్వహించిన సభలో ఆ జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మేము మా జిల్లాలో 12కు 12 సీట్లు గెలుస్తాం.. రేవంత్‌రెడ్డి పాలమూరులో 14కు 14 సీట్లు గెలిపిస్తారా అని సవాల్ విసిరారు. అక్కడే ఉన్న రేవంత్‌రెడ్డి సైతం యస్.. గెలిచి తీరుతాం అన్నారు. వారు అన్నట్లే నల్లగొండ జిల్లాలో 11 సీట్లు కాంగ్రెస్‌కు రాగా.. మహబూబ్‌నగర్‌లో 12 కైవసం చేసుకున్నారు. -
అన్యాయంపై తిరుగుబాటు ‘ముల్కీ!’
ముల్కీ ఉద్యమంలో భాగంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి సరిగ్గా 70 ఏళ్లు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంత ప్రజలపై పెత్తనం చలాయించడం, తెలంగాణ విద్యార్థు లకు దక్కాల్సిన ఉద్యోగాలను నాన్ ముల్కీ లైన ఆంధ్ర ప్రాంత ప్రజలు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి పొందడం వంటి చర్యల ద్వారా ఎంతో దోపిడీ చేశారు. దీనిని వ్యతి రేకిస్తూ ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి ప్రజలకే కల్పిం చాల్సిందిగా కోరుతూ ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ నినాదాలతో ముల్కీ ఉద్యమం వరంగల్‌లో ప్రారంభమయ్యింది. ‘ముల్కీ’ అనగా స్థానికుడు అని అర్థం. ఈ ముల్కీ సమస్య 1868 నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. నాన్ ముల్కీలను తొలగించాలని అనేక సమావేశాలు నిర్వహించి, వినతి పత్రాలు అందించి ప్రజల్లో చైతన్యం కలిగించారు నాటి స్థానిక ముస్లిం మేధావులు. పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయింది. పోలీస్ చర్య పిమ్మట ఏర్పడిన అస్థిరత ఒత్తిళ్ళ కారణంగా పోలీస్ శాఖలో గైర్ ముల్కీలను నియమించడం అనివార్యమైందని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలిపారు. కానీ పోలీస్ శాఖలోనే కాకుండా అనేక శాఖల్లో గైర్ ముల్కీల నియామకం జరిగింది. వరంగల్‌లోని డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా నియమించ బడిన పార్థసారథి 1952 జూన్, జూలై నెలల్లో 180 మంది ఉపాధ్యా యులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. తెలంగాణ వారిని మారు మూల గ్రామాలకు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీ చేస్తూ... వీరి స్థానాల్లో ఆంధ్ర ఉపాధ్యాయులను నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నాన్ ముల్కీ అయిన పార్థసారథి ఇంతటి ఇబ్బందులకు గురి చేయడంతో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులంతా విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షండార్కర్కు 1952 జూలై 26న ఫిర్యాదు చేశారు. ఆ విషయంపై వరంగల్‌లో విచారణ జరిపించారు. న్యాయ పరమైన విచారణ జరగాలని వెంటనే నాన్ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని వరంగల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. ఆ ర్యాలీనే 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు జూలై 27, 28, 29 తేదీల్లో తరగతులు బహిష్కరించి ముల్కీ సమస్యపై ముఖ్యమంత్రికి తీర్మానాన్ని పంపాలని నిర్ణయిం చారు. ఈ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తమ తమ జిల్లాల్లో విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండడంతో ముఖ్యమంత్రి బూర్గుల విద్యార్థులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసి సమ్మె విరమించు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ ఎలాంటి పత్రికా ప్రకటన వెలువడలేదు. దీంతో హన్మకొండ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకొని ఉద్యమం తారస్థాయికి చేరుకోకముందే అణచివేయాలని విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా విద్యార్థులు రోడ్లెక్కారు. సెప్టెంబర్ మూడవ తేదీన ముల్కీ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులను అదుపు చేయడం కోసం పోలీసులు సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 కింద ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు చేశారు విద్యార్థులు. సిటీ కాలేజ్ ఆవరణలోని విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. సిటీ కాలేజ్ పక్కనే గల హైకోర్టులో ఉన్న వకీల్, ఆనాటి శాసనసభ్యుడు కొండా లక్ష్మణ్ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మేజిస్ట్రేట్ పరిస్థితిని అదుపు చేయడా నికి వెంటనే ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక విద్యార్థికి బుల్లెట్టు తగిలి నేలకు ఒరిగాడు. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వుతూ బస్సులను తగలబెట్టారు. దీంతో మేజిస్ట్రేట్ రెండోసారి ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చాడు. చాలామందికి బుల్లెట్లు తగిలి నేలపై పడి పోయారు. సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడే చనిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పిటల్లో మరణించారు. చనిపోయిన వారి శవాలను తీసుకొని ఊరేగింపు చేయాలని విద్యార్థులు నిర్ణయించుకొని సెప్టెంబర్ 4న ఉస్మానియా హాస్పిటల్‌కి బయలుదేరారు. శవాలను అప్పగించే విషయంలో వాగ్వాదం పెరిగి పోలీసులు మళ్లీ విద్యార్థుల పైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. వందల మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. (క్లిక్: బంగారు బాతును కాపాడుకోవాలి!) ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనీ, ఆంధ్రలో ఎట్టి పరిస్థి తుల్లో విలీనం చేయరాదన్న తెలంగాణ ప్రజల అంతర్గత ఆకాంక్షకు నిలువెత్తు రూపమే ఈ మహోత్తర ముల్కీ ఉద్యమం! అందుకే ఆ తర్వాత తలెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ముల్కీ ఉద్యమం నేపథ్యాన్ని ఏర్పరచిందని చెప్పవచ్చు. (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) - జక్కుల శ్రీనివాస్ హెచ్‌సీయూ విద్యార్థి (సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పుల సంఘటనకు 70 ఏళ్లు) -
బూర్గులకు గవర్నర్ దత్తాత్రేయ నివాళి
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ నాయకుడిగా, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దత్తాత్రేయ శనివారం బూర్గుల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీ, సీసీఆర్‌ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు. కాగా బండారు దత్తాత్రేయ ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది. బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్‌రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి -
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు
సాక్షి, వికారాబాద్/షాద్‌నగర్: ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరించి మంచి పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి రామకృష్ణారావుది షాద్‌నగర్ నియోజకవర్గంలోని బూర్గుల స్వగ్రామం. మర్రి చెన్నారెడ్డిది వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం. జిల్లాల పునర్విభజనలో భాగంగా షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిసింది. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో 1899లో నర్సింగ్‌రావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు. 1948 అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన విద్యా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు. 1952లో షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత ఎల్ఎల్రెడ్డిపై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ఉండటంతో తొలిముఖ్యమంత్రి పదవిని రామకృష్ణారావు అలంకరించారు. ఆయన తన హయాంలోనే రక్షిత కౌలుదారు(టెనెంట్) చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. అనంతరం 1956లో విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956–1960లో కేరళ, 1960–1962 ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1967 సెప్టెంబరు 14న ఆయన కన్నుమూశారు. బూర్గుల గ్రామంలో రామకృష్ణారావు స్మారక స్థూపాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ముద్ర వేసిన మర్రి.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి‘ పార్టీని ఏర్పాటు చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఈయన స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామం. మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు 1919 జనవరి 13 జన్మించారు. ప్రాథమిక విద్యను సిరిపురంలోనే పూర్తిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారంలో తన మేనమామ కొండా వెంకట రంగారెడ్డి వద్ద ఉంటూ ప్రాథమికోన్నత, వికారాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీసీ పూర్తి చేసి ఉస్మానియాలోనే డాక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1952, 1957లో వికారాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1962,1967లో విజయం సాధించారు. అనంతరం 1978లో మేడ్చల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978–79, 1989–90లో రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 27 ఏళ్ల పిన్నవయసులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన తన మేనమామ మీద ఉన్న అభిమానంతో ఆయన పేరుమీదే కొండా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. -
నేను సంపాదించుకున్నది అదే..
బూర్గుల రామకృష్ణారావు.. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి! ఆయన నడతే అతని వారసులకు సంపదైంది. ఆ సంపదను రెండింతలు చేసి ఆ పరంపరను నిలిపాడు రామకృష్ణారావు తమ్ముడి కొడుకు బూర్గుల నర్సింగ రావ్! కమ్యూనిస్ట్ లీడర్‌గా, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్‌గా పనిచేసి ప్రస్తుతం ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారాయన. నేడు... బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి.. ఈ సందర్భంగా నర్సింగరావు తన పెద్దనాన్న గురించి మననం చేసుకున్నారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. పెద్దనాన్న (బూర్గుల రామకృష్ణారావు) మృదుస్వభావి. లిబరల్గా ఉండేవారు. తెలుగు, ఉర్దూ, పర్షియన్, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో దిట్ట. మా కుటుంబంలో ఇంగ్లిష్ మా పెద్దనాన్న, నాన్నతోనే మొదలైంది. పెద్దనాన్నకు మరాఠీ, కన్నడ భాషలూ తెలుసు. కేరళకు తొలి గవర్నర్‌గా వెళ్లి మలయాళం కూడా నేర్చుకున్నాడు. ఉమర్ఖయ్యాం పర్షియన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఇక్కడి ధర్మవంత్ స్కూల్లో స్కూలింగ్, నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి పుణే ఫెర్గ్యూసన్ కాలేజ్‌లో బీఏ, ముంబైలో ఎల్ఎల్బీ చేశారు. సిటీకి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. పెదనాన్న దగ్గర పీవీ నరసింహారావు జూనియర్‌గా ఉండేవారు. ఫుల్‌టైమ్ పాలిటిక్స్.. 1944, 45 నుంచి ఫుల్‌టైమ్ పాలిటిక్స్లోకొచ్చారు. ఆయన హైదరాబాద్ స్టేట్‌కి ముఖ్యమంత్రి అయి ‘దిల్కుషా’లోకి మారేంత వరకు మాది ఉమ్మడి కుటుంబమే. ఆంధ్రజన సంఘం, ఆంధ్రమహాసభ రెండింట్లోనూ యాక్టివ్‌గా ఉండేవారు. రెండో ఆంధ్రమహాసభకు పెద్దనాన్నే అధ్యక్షుడు. గాంధీగారి ప్రభావం చాలా ఉంది ఆయన మీద. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అక్కడ గాంధీ నిరాహారదీక్ష చేస్తే, ఇక్కడ పెద్దనాన్నా నిరాహార దీక్ష చేశారు. ఆయనను చూసి నేనూ ఉపవాసం ఉన్నాను. నాపై ఆయన ప్రభావం అంతలా ఉండేది. ఒక్కమాటా అనలేదు.. నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై అండర్ గ్రౌండ్‌కీ వెళ్లాను. నేను అరెస్ట్ అయినప్పుడు పెద్దనాన్న మినిస్టర్ కూడా. మా నాన్న చాలా కోపిష్టి. ఆయనకు విరుద్ధం పెద్దనాన్న. నేను విడుదలై వచ్చాక నా మీద కోపంతో నాన్న అరుస్తుంటే.. ‘వాడిమీద అట్లా అరవకు, నెమ్మదిగా చెప్పు’ అనేవారు పెద్దనాన్న. అంతేతప్ప ఎప్పుడూ నా దారి మార్చుకొమ్మని అనలేదు. 1952లో ముల్కీ ఉద్యమమప్పుడు.. నేను నిజాం కాలేజ్‌లో ఎంఏ చదువుతున్నాను. సిటీ కాలేజ్ నుంచి కోఠీ ఇప్పటి ఈఎన్టీ హాస్పిటల్ వరకు పెద్ద ర్యాలీ తీశాం. కోఠీ వరకు వచ్చాక నేను క్యాంపస్ వెళ్లిపోయాను. ర్యాలీ అబిడ్స్‌వైపు మళ్లింది. అందులో కొందరు స్టూడెంట్స్‌కి ఈఎన్టీ హాస్పిటల్ ఆవరణలో ముఖ్యమంత్రి కారు కనిపించేసరికి లోపలకు వచ్చి కారును కాల్చేశారు. అయితే మా పెద్దమ్మ ఆ కారులో హాస్పిటల్లో జరుగుతున్న ఓ మహిళామండలి మీటింగ్‌కి వచ్చింది. కారును కాల్చేస్తున్నప్పుడు ఆమె మీటింగ్‌లో ఉంది. ‘కొడుకు కాబట్టి రామకృష్ణారావు ఏమనట్లేద’ని పెదనాన్నను కొందరు కామెంట్ చే శారు. ఆయన చెప్పలేదు.. నేనూ ఇబ్బంది పెట్టలేదు కమ్యూనిస్ట్ ముద్రతో ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉన్నా. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా.. కానీ ఉద్యోగం ఇప్పించమని ఆయనను అడగలేదు. ఆయనా రెకమెండ్ చేయలేదు. ఒక్కసారి.. జైలు నుంచి వచ్చాక మళ్లీ కాలేజ్‌లో చేరడానికి పర్మిషన్ ఇప్పించమని అడిగా. అప్పుడు ఉస్మానియా వీసీ అలియావర్ జంగ్. అలియావర్జంగ్కి ఓ ఉత్తరం రాసి నన్ను వెళ్లి కలవమని చెప్పారు. ఆయనకు ఫోన్ కూడా చేశారు. అలియావర్ జంగ్ని వెళ్లి కలిశా... ‘అసలు అటెండెన్స్ లేకుండా పర్మిషన్ ఎలా ఇస్తారు?’అన్నారాయన. ‘మీరు తలుచుకుంటే అవుతుంది’ అన్నా. ‘కుదరదు’ అని కరాఖండిగా చెప్పి మా పెద్దనాన్నకు ఫోన్ చేశారు ‘పర్మిషన్ ఇవ్వడం వీలుకాదు. అంతమాత్రాన వర్రీ కావల్సిందేం లేదని చెప్పండి. నవంబర్‌లో ఎగ్జామ్స్ రాయమనండి’ అని. ఇంకోసారి.. చైనాలో జరుగుతున్న ఓ స్టూడెంట్ కాన్ఫరెన్స్‌కి వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌కి అప్లయ్ చేసుకుంటే రిజెక్ట్ అయింది. పెద్దనాన్నకి చెప్తే నవ్వి ఊరుకున్నారు అప్పటికి. నెల్లాళ్ల తర్వాత అడిగారు నీ పాస్‌పోర్ట్ ఏమైంది? అని. ‘మీ గవర్నమెంట్ ఇవ్వనంది కదా’ అన్నా. అప్పటికి సెలైంట్‌గా ఊరుకొని సెంట్రల్ మినిస్టర్‌కి నాకు పాస్‌పోర్ట్ జారీ చేయమని ఉత్తరం రాశారు ! అంతే! ఈ రోజు హైదరాబాద్ సమాజంలో నాకున్న స్థానం... రెస్పెక్ట్.. నా అంతట నేను సంపాదించుకుందే! ఆయన గౌరవాన్ని కాపాడానే తప్ప ఇరకాటంలో పెట్టలేదు. ఆయన మాకు నేర్పిన విలువా అదే! - సరస్వతి రమ -
ఏడున్నరేళ్ల పదవీయోగం...
ఫ్లాష్‌బ్యాక్: ఏపీ మొదటి శాసనసభ రికార్డు ఒకసారి ఎన్నికై ఏడున్నరేళ్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన అవకాశం తెలుగువారికే దక్కింది. హేమాహేమీలు కొలువుదీరిన 1956 ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ ఇందుకు వేదికైంది. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చివరి ఎన్నికల సందర్భంగా ఈ సభ విశేషాలను గుర్తు చేసుకుందాం. మూడు ప్రాంతాల ఉద్ధండుల వేదిక 1956లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభకు బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్నప్పుడు 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకాంధ్ర ఉద్యమం, అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యనిషేధం అంశంపై ఎదుర్కొన్న అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత 1955లో ఈ ప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్‌రెడ్డి... 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ తర్వాతి సంవత్సరమే 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లే కావడంతో ఇక్కడ ఎన్నికలు జరపలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలోని 196 మంది శాసనసభ్యులు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారితో కొలువైంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి దగ్గరే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం, మరో ఆసక్తికర విషయం. -
సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్
-
సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్
హైదరాబాద్: తమ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్న సోనియా గాంధీకి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలుసా అని అడిగారు. వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. చీలికవాదం తెలంగాణకు హానికరమని రావి నారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జగన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం విభజించిన తర్వాత ఇక్కడి ఆస్తుల విలువలు పడిపోతే ఆ విలువ సోనియా ఇస్తారా, చంద్రబాబు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. భారతదేశ పౌరసత్వం తీసుకున్న వారిని ఇటలీకి తిరిగి వెళ్లిపోమంటే ఒప్పుకుంటారా అంటూ అడిగారు. 30 ఏళ్లుగా ఉంటున్న సోనియాకే భారతదేశంపై ఇంత అధికారం ఉంటే వందల ఏళ్లుగా ఉంటున్న తమకు ఎంత అధికారం ఉండాలని సూటిగా ప్రశ్నించారు. ఈ మాట అంటే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారని జగన్ ఎద్దేవా చేశారు. ఓట్ల, సీట్ల కోసం విభజించే రాజకీయాలు తెరమరుగు కావాలని ఆకాంక్షించారు. సోనియా గుండెలు అదిరేలా, కిరణ్-చంద్రబాబు గూబలదిరేలా సమైక్య గళాన్ని వినిపించాలన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా అంటూ సభలోని వారిని జగన్ ప్రశ్నించగా 'నో' అనే సమాధానం వచ్చింది. విభజన బిల్లు ఆపే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ పోరాడుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం, ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నేతనే ప్రధానిని చేద్దామన్నారు.