వర్థన్నపేట : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సమైక్య శంఖారావానికి వస్తున్న సమైక్యవాదులను ....ఆందోళనకారులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి సమైక్య శంఖారావానికి అశేష సంఖ్యలో జనం తరలి వస్తున్నారు.
అయితే నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారీ వర్షాల కారణంగా .. వారు వరంగల్ జిల్లా వర్థన్నపేట నుంచి వస్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అలాగే సమైక్య శంఖారావానికి తరలి వస్తున్న సమైక్యవాదుల 50 వాహనాలను జనగామ వద్ద కూడా ఆందోళనకారులు అడ్డుకుని నాలుగు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఇక గడిపికొండ వద్ద 150 బస్సులను అడ్డుకున్నారు.