రాష్ట్ర విభజన విషయంలో ప్రజలు ఏమంటారో తెలుసుకోడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభలో నేరుగా ప్రజలకు కొన్ని ప్రశ్నలు సంధించారు.
రాష్ట్ర విభజన విషయంలో ప్రజలు ఏమంటారో తెలుసుకోడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభలో నేరుగా ప్రజలకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయా ప్రశ్నలకు అశేషసంఖ్యలో హాజరైన ప్రజలు ఒప్పుకొనేది లేదని సమాధానాలు ఇచ్చారు.
రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకొంటారా.. నో, ఒప్పుకోం
తెలుగు జాతి ముక్కలు కావాలా.. నో
మన నీటి కోసంమనమే కొట్టుకుని చావాలా.. నో
మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకుని చావాలా.. నో
అన్నదమ్ముల మధ్య రోజూ గొడవలు జరగాలా.. నో
తెలుగుజాతికి ద్రోహం చేస్తున్న సోనియా, కిరణ్, చంద్రబాబును క్షమించాలా.. నో
నీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను అటకెక్కిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా.. నో