
చౌడేపల్లి నుంచి జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చౌడేపల్లి నుంచి సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చౌడేపల్లి, కొండమర్రి, లద్దిగాం, చందల్లా, పుంగనూరు గ్రామల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బిల్లేరు, పూదిపట్ల, భగత్సింగ్ నగర్ మీదగా జగన్ పర్యటన కొనసాగనుంది. లద్దిగాంలో అంజన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పుంగనూరులో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
యాత్రకు 1 నుంచి 3 దాకా విరామం
చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం యాత్రకు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం పుస్కరించుకొని ఈనెల 31, జనవరి 1 తేదీల్లో యాత్రను నిలిపి వేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, భద్రతా సిబ్బంది చేసిన అభ్యర్థన మేరకు జగన్ డిసెంబర్ 31 సాయంత్రమే యాత్ర ముగిస్తున్నారని తెలిపారు. మదనపల్లిలో బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం జగన్ హైదరాబాద్‌కు వెళ్లిపోతారని, జనవరి 3న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తిరిగి 4న తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట నుంచి యాత్ర పునః ప్రారంభిస్తారని తెలిపారు.