ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది: జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగుతోంది. డిసెంబర్ 27న మొదలైన రెండో విడత సమైక్య శంఖారావానికి చిత్తూరు జిల్లా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. మహిళలు, యువత , విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వృద్దులు నడవలేని స్థితిలో కూడా మహానేత వైఎస్ఆర్ తనయుడ్ని చూడటానికి తరలి వస్తున్నారు.
తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరితో జగన్ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. పెద్దాయన ఉన్నప్పుడు పించన్ వచ్చేదని..ఆయన పోయిన తరువాత రావడంలేదని ఓ వృద్దురాలు చెప్పటంతో...... మన ప్రభుత్వం వచ్చిన తరువాత అప్లికేషన్ పెట్టు..నీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని జగన్ ఆవృద్దురాలికి మాట ఇచ్చారు.
ఇక మహిళలు హారతులు పడుతూ జగన్‌కు గ్రామగ్రామాన స్వాగతం పలుకుతున్నారు. ఓ వికలాంగ వృద్దురాలు తనకు పింఛన్ రావడంలేదని...అధికారులు పింఛన్ ఇవ్వడానికి నిరాకరించారని ఆమె తన గోడును వెలిబుచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలుకు జగన్ ధైర్యం చెప్పి పంపించారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అంటూ తనను కలవడానికి వచ్చిన వృద్దులకు జగన్ భరోసా చెప్పారు. మరోవైపు మహిళలు చంటి పిల్లలను చంకన వేసుకుని మహానేత తనయుడ్ని చూడటానికి వచ్చారు.