27 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు జిల్లాలో రెండవ విడుత సమైక్య శంఖారావాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం మీడియాకు వెల్లడించారు. పలమనేరులో నియోజవర్గంలో డిసెంబర్ 27 తేది నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం కొనసాగుతుంది అని రఘురాం తెలిపారు. పలమనేరులోని 4 రోడ్ క్రాస్ కు మధ్యాహ్నం చేరుకుని యాత్రను ప్రారంభిస్తారన్నారు.
పత్తికొండ, నక్కపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి విగ్రహా ఆవిష్కరణ జరుగుతుంది అని, అప్పిన పల్లిలో వైఎస్ మృతి వార్త తట్టుకోలేక మరణించిన వ్యక్తి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చనున్నారని రఘురాం తెలిపారు. 28 తేదిన రాయలపేటలో బహిరంగ సభ, కమ్మపాలెంలో మరో కుటుంబాన్ని జననేత పరామర్శిస్తారు. అదే రాత్రి మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి నివాసంలో బస చేస్తారని కార్యక్రమ వివరాలను మీడియాకు తెలిపారు.
తొలి విడుత సమైక్య శంఖారావం కార్యక్రమం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.