Chowdepalli
-
చాడేపపల్లిలో చిరుత వాటి పిల్లలు సంచారం!
సాక్షి, చౌడేపల్లె(చిత్తూరు): మండలంలోని కందూరు బీట్, తవళం బీట్ పరిధిలో గోవిందురాజుల చెరువు సమీపంలో గల అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాగిరెడ్డిపల్లె, ఎల్లంపల్లె, బత్తలాపురం, తెల్లనీళ్లపల్లె మడుకూరు తదితర గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలకు సమీపంలోనే అటవీ ప్రాంతం కలదు. పదిరోజుల క్రితం చిరుతపులి దాడిలో బత్తలాపురానికి చెందిన సుబ్రమణ్యం, గంగాధర్, ఎల్లంపల్లెకు చెందిన నరసింహులు ఆరు మేకలు మృతిచెందాయి. దీంతో అటవీ ప్రాంతంలోకి మేతకు మేకలు, పశువులు, గొర్రెలను తోలుకెళ్లడం లేదు. చిరుత పులితోపాటు వాటి పిల్లలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నెమిలిగుట్ట, పారాలకుప్ప, గువ్వరాయి, గోవిందరాజుల చెరువు, మడుకూరు మార్గంలో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసినా అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వావపోతున్నారు. దీనిపై ఎఫ్‌బీవో రామకృష్ణ మాట్లాడుతూ పులి సంచారం విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. అడవి వైపు వెళ్ల వద్దని ప్రజలను తెలియజేసినట్టు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఎస్టీలు -
దుండగుల కోసం ముమ్మర గాలింపు
దుండగుల కోసం ముమ్మర గాలింపు చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండల కేంద్రంలోని బజారువీధిలో వెలసిన శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో శనివారం అలజడి సృష్టించిన ఎనిమిది మంది దుండగుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఆలయం పైకప్పుకు ఏర్పాటుచేసిన రాతిమొగ్గను దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో అరెస్టయిన తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన సద్దాంహుస్సేన్, యాదమరి మండలం 184 గొళ్లపల్లెకు చెందిన వినాయకం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదమరి మండలం 184 గొళ్లపల్లికి చెందిన వినాయకం చౌడేపల్లె మండలంలోని చెడుగుట్ల పల్లెకు వెళ్లే రోడ్డులో ఉన్న ఒక రైతు పొలంలో పనులు చేసుకుంటున్నాడు. అతనికి అర క్కోణంకు చెందిన జయకుమార్ పరిచయమయ్యాడు. అతని ద్వారా అరక్కోణం నుంచి కమల్, దేవా, సద్దాంహుస్సేన్, పురుషోత్తంబాబు, ప్రభాకర్, ప్రకాష్‌ను రప్పించినట్లు తెలుస్తోంది. వీరు ఆలయంలో ఉన్న రాతి మొగ్గలో వజ్రాలున్నాయని, దాన్ని అపహరించుకు వెళ్లాలని పథకం వేసినట్లు సమాచారం. ఈ మేరకు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం చౌడేపల్లెకు చేరుకుని నాలుగు ద్విచక్ర వాహనాల్లో బోయకొండకు Ðð ళ్లారు. సాయంత్రం వరకు అమ్మవారి ఆలయ పరిసరాల్లో గడిపి తిరిగి మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే రాతి మొగ్గను ధ్వంసం చేశారు. అర్చకులు, స్థానికులు అప్రమత్తమై దుండగుల్లో సద్దాం హుస్సేన్, వినాయకంను పట్టుకున్నారు. స్థానికుల హస్తంపై ఆరా పట్టణం నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయంలోకి తమిళనాడుకు చెందిన వారు ప్రవేశించడానికి స్థానికుల హస్తం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది రూ.కోట్లు విలువ చేసే ఏడు పడగల నాగదేవత విగ్రహం లభ్యం కావడం సంచలనం రేపింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 12న దొరబావి తోపు వద్ద గల పార్వేట మండపాన్ని దుండగలు డిటోనేటర్లతో పేల్చివేశారు. వాటితో కూడా ఈ ముఠాకు సంబంధాలున్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ భద్రతకు ప్రత్యేక చర్యలు ఆలయంలో భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు అర్చకులు రాజశే«ఖర దీక్షితులు, కుమారస్వామి, మహేష్‌స్వామి ఆదివారం తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు. -
చౌడేపల్లి నుంచి జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చౌడేపల్లి నుంచి సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చౌడేపల్లి, కొండమర్రి, లద్దిగాం, చందల్లా, పుంగనూరు గ్రామల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బిల్లేరు, పూదిపట్ల, భగత్‌సింగ్ నగర్ మీదగా జగన్ పర్యటన కొనసాగనుంది. లద్దిగాంలో అంజన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పుంగనూరులో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. యాత్రకు 1 నుంచి 3 దాకా విరామం చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం యాత్రకు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం పుస్కరించుకొని ఈనెల 31, జనవరి 1 తేదీల్లో యాత్రను నిలిపి వేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, భద్రతా సిబ్బంది చేసిన అభ్యర్థన మేరకు జగన్ డిసెంబర్ 31 సాయంత్రమే యాత్ర ముగిస్తున్నారని తెలిపారు. మదనపల్లిలో బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం జగన్ హైదరాబాద్‌కు వెళ్లిపోతారని, జనవరి 3న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తిరిగి 4న తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట నుంచి యాత్ర పునః ప్రారంభిస్తారని తెలిపారు.