
అభివాదాలతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకోగానే అభివాదాలతో ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది. సభకు చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్ర పటాలకు, వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జగన్ను కలిసేందుకు...ఆయనతో కరచాలనం చేసేందుకు జనాలు పోటీ పడటంతో వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కాగా జన సందోహంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసి పోవటంతో సభకు వెళ్లలేని ప్రజలు ఎల్ఈడీల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.