కేతేపల్లి, న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్‌ఐ దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన సమైక్య శంఖారావం సభ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ఎస్‌ఐ ఎల్. రాములు నాయక్‌కు నకిరేకల్ సర్కిల్ పరిధిలోని కేతేపల్లి మండలంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బందోబస్తు విధులు వేశారు. ఇనుపాముల శివారులోగల వై-జంక్షన్ వద్ద ఆయన విధి నిర్వహణలో ఉండగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాయక్‌ను వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.
వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : సమైక్య శంఖారావం సభ నిర్వహణ నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ఎస్‌ఐ రాములు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసి సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి జగన్ ఒక సందేశంలో తన సానుభూతిని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ దుర్మరణం
Published Sun, Oct 27 2013 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement