జగన్కు సమైక్యవాదుల ఘన స్వాగతం | YS Jagan mohan reddy receives Grand Welcome in palamaneru | Sakshi
Sakshi News home page

జగన్కు సమైక్యవాదుల ఘన స్వాగతం

Published Fri, Dec 27 2013 12:34 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్కు సమైక్యవాదుల ఘన స్వాగతం - Sakshi

జగన్కు సమైక్యవాదుల ఘన స్వాగతం

పలమనేరు :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమైక్యవాదులు చిత్తూరు జిల్లాలో ఘన స్వాగతం పలికారు. రెండో విడత సమైక్య శంఖారావంతో పాటు ఓదార్పు యాత్రను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు జగన్కు జంగాలపల్లె వద్ద భారీ స్వాగతం లభించింది. పలమనేరు నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, జిల్లా కన్వినర్ నారాయణస్వామి, అభిమానులు, పార్టీ నేతలు, సమైక్యవాదులు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పార్టీ పతాకాలను ఏర్పాటు చేశారు.

జగన్ పర్యటన వివరాలు :
జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం  జంగాలపల్లెకు చేరుకున్నారు. అక్కడ నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని గండ్రాజుపల్లె, నాలుగురోడ్ల కూడలి మీదుగా పత్తికొండకు వస్తారన్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
అనంతరం మామడుగులో రోడ్‌షో నిర్వహించి ఆర్‌టీఏ చెక్‌పోస్టు మీదుగా పలమనేరు మండలంలోని నక్కపల్లెకు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి కొలమాసనపల్లె రోడ్‌షోల్లో పాల్గొంటారు.

 అక్కడ నుంచి పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట మీదుగా వెళ్లి అప్పినపల్లెలో చేలూరి జగన్నాథం కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం అక్కడి నుంచి కుంబార్లపల్లె, సంపల్లె మీదుగా పర్యటన సాగుతుంది. పెద్దవెలగటూరు గ్రామంలో రోడ్‌షో నిర్వహించి అక్కడే జగన్‌ రాత్రికి  బస చేస్తారు.

శనివారం ఉదయం రాజుపల్లె, కరసనపల్లె, ముతుకూరు, పెద్దపంజాణి, బసవరాజు కండిగ, కోగిలేరుల మీదుగా వెళ్లి రాయలపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి కొళత్తూరు, తుర్లపల్లె, కొత్తూరుల మీదుగా వెళ్లి కెళవాతిలో రాత్రి బస చేస్తారు. 29వ తేదీన వీరప్పల్లె మీదుగా వెళ్లి చౌడేపల్లె మండలంలోని దాదేపల్లె, దుర్గ సముద్రంలో తోటి సంకరమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు.

అలాగే చారాలలో వైఎస్సార్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అక్కడి నుంచి శెట్టిపల్లె చౌడేపల్లె, ఠాణాఇండ్లు, పుదిపట్ల మీదుగా లద్దిగం చేరుకుని, అక్కడ అంజప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు.. చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల మీదుగా పుంగనూరుకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రికి అక్కడే బస చేసి 30వ తేదీ రాంపల్లె, సుగాలీమిట్ట, ఈడిగపల్లె, మొలకలదిన్నెల మీదుగా మదనపల్లెకు చేరుకుంటారు. గొల్లపల్లెలో జరిగే ఓదార్పులో పాల్గొంటారు.  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 29వ తేదీన తొలివిడత సమైక్య శంఖారావం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement