సమైక్య శంఖారావానికి తరలి వస్తున్నవారిలో అనేకమంది కవులు, కళాకారులు, గాయకులు అందరూ ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ కవి గాయకుడు తన బృందంతో సహా కలిసి వచ్చి సభా ప్రాంగణం సమీపంలో కంజీర పట్టుకుని కదలి రా అన్నయ్యా అంటూ పాట పాడి అందరినీ ఉత్సాహపరిచారు.
కదలిరా అన్నయ్యా.. కదలిరా అక్కయ్యా.. కదలిరా తమ్ముడా.. కదలిరా చెల్లెలా
కసికసిగా రాష్ట్రాన్ని విడదీయాలని.. ఉసిగొల్పే దుర్నీతిని మసిచేయడానికి..
కదలిరా అన్నయ్యా (2)
కుళ్లుగొట్టి కంపుగొట్టు రాజకీయ మలినము.. కదంతొక్కి కదలి సాగి చేయాలి ప్రక్షాళనము..
అంటూ ఈ పాట సాగింది.