నిర్వాసితులకు పునరావాసం
Published Thu, Dec 26 2013 4:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
హిరమండలం, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే..వంశధార నిర్వాసితు లకు పునరావాసం కల్పిస్తామని, తాగు, సా గునీటి సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ జి ల్లా కన్వీనర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. స్థానిక పాతబ స్టాండ్ ఆవరణలో బుధవారం నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ విజయవంతమైంది. ముఖ్య అతిథిగా కృష్ణదాస్ మాట్లాడుతూ..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బలాన్ని కూడగడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యా త్రకు వచ్చిన ఆదరణ చూసి, ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డాయని పేర్కొన్నా రు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథం లో నడిపించాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ‘విభజించు..పాలించు’ రాజకీయాలకు చరమగీతం పాడాల న్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలపై పోరాడేందుకు అహర్నిశలూ కష్టపడతామన్నారు. రాజకీయ భిక్షపెట్టిన హిరమండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
భారీగా చేరికలు
ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. హిరమండలం మేజరు పంచాయతీ సర్పంచ్ ఎ.సూర్యకుమారి, ఉపసర్పంచ్ ఎ. అబ్బాయితో పాటు 14మంది వార్డు సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ ఎ.రవిబాబు, డి.రమేష్, ఎస్.గోవింద, డి.నగేష్, కె. మల్లేశ్వరరావు, లాడె భాస్కరరావు, పి.నాగేశ్వరరావు, పి.రామారావు, పుల్లా నాగేశ్వరరావు, ఎ.నాగేశ్వరరావు, బి.అప్పలనాయుడు, పెరైడ్డి తవుడు, కె.కామేశ్వరరావు, డి.రామారావు, కె.మురళి, ఎం.మురళి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. అలాగే దుగ్గుపురం సర్పంచ్ ఆర్.మోహనరావు, మాజీ సర్పంచ్ మడపాన భాస్కరరావు, చల్ల భాస్కరరావు, రేగాన కృష్ణారావు, పాడలి పంచాయతీ నుంచి మాజీ ఉప సర్పంచ్ పెదకోట సాధుబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు యర్లంకి వెంకటరావు, గొర్లె మోహనరావు, పి.గోవిందరావు, బి.వెంకటరావు, కె.గోవిందరావు, బర్రి ఆఫీసు, గొర్లె రమేష్, అం పోలు అప్పలనాయుడు, సోలిపి నుంచి నేరడి రామయ్య, ఎన్.పున్నయ్య, పి.దండాసి, కె.గణపతిరావు, పి.వీరన్న, దబ్బగూడ నుంచి సవర బాపన్న, సన్నాయి, పి.అప్పల స్వామి, పి.చిన్నప్పలస్వామి, కొమనాపల్లి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, గొట్ట నుంచి మాజీ సర్పంచ్ వంజరాపు రామారావుతో పాటు వారి అనుచరులు పార్టీ గూటికి చేరారు.
Advertisement
Advertisement