సమైక్యాంధ్రకు కట్టుబడింది జగన్ ఒక్కరే
Published Sun, Jan 26 2014 2:37 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమైక్య పాదయాత్రలు శనివారం జోరుగా సాగాయి. ఈ పాదయాత్రల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా అధికసంఖ్యలో పాల్గొని వైఎస్సార్ సీపీకి బాసటగా నిలిచారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ తమదేనని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ సమైక్య నినాదం పాదయాత్రలో భాగంగా శనివారం రాజమండ్రిలోని జాంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణచౌదరితో కలిసి ఆదిరెడ్డి పాదయాత్ర చేశారు. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ పార్టీ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టి, రాష్ర్ట విభజన వల్ల కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ధవళేశ్వరం శివారు ఎర్రకొండలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు.
ఇందులో కూడా ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు వెంకట రమణచౌదరి పాల్గొన్నారు. కోరుకొండ మండలం గుమ్మలేరులో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బొడ్డు వెంకట రమణచౌదరి పాదయాత్ర నిర్వహిం చారు. పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అయినవిల్లిలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో గడపగడపకూ వైఎస్సార్‌సీపీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పట్టణంలోని 22వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు.
Advertisement