Paada yatra
-
కేటీఆర్ సూపర్!
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి కేటీఆర్ తెలంగాణకు ఒక గొప్ప వరం. ఆయన ప్రసంగించే తీరు అమోఘం. ఒక రాజకీయ నేతగా ప్రజాసమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ దూసుకెళ్తున్న విధానమే కేటీఆర్‌కు వీరాభిమానిగా మార్చాయి..’ అని ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నాడు. టీఆర్ఎస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఏకంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 17 రోజుల పాదయాత్ర చేసి ఆదివారం రోహిత్ ప్రగతిభవన్‌కు చేరుకున్నాడు. అనంతరం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావును కలసి మాట్లాడాడు. సుదూర ప్రాంతం నుండి అభిమానంతో వచ్చిన రోహిత్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తనకు తెలంగాణ పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించాయని రోహిత్ తెలిపాడు. యువతరానికి స్ఫూర్తినిచ్చేలా మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారని, తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన ముఖచిత్రాన్ని గుండె మీద టాటూగా వేయించుకున్నానని వెల్లడించాడు. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో అభివృద్ధి బాగుందన్నాడు. కాగా టీఆర్ఎస్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలని రోహిత్ కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ చేరుకున్న రోహిత్‌ను టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రి వద్దకు తీసుకుని వచ్చారు. -
ప్రజాసంకల్పయాత్ర 200వ రోజు వేడుకలు
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు, సంఘీభావ యాత్రలు చేపట్టారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ పాదయాత్ర కీలక ఘట్టానికి చేరుకోవడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పేదలకు చీరల పంపిణీ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్ సీపీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, రాష్ట్ర ప్రధాన కార్శదర్శి కొయ్యే మోసేన్‌రాజు, వేగిరాజు రామకృష్ణంరాజు, గాదిరాజు సుబ్బరాజు, గూడూరి ఉమాబాల, కనకరాజు సూరి, ఏఎస్‌రాజు, మేడిదిజాన్స్, ఎన్వీఆర్ దాసు తదితరులు పాల్గొన్నారు. కొఠారు అబ్బాయి చౌదరి పాదయాత్ర వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో పెదవేగి మండలం బాపిరాజుగూడెం నుంచి విజయరాయి వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, కొఠారు రామచంద్రరావు, కమ్మ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకున్నందున వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజల సమక్షంలో బాపిరాజుగూడెంలో వైఎస్సార్ నేతలు కొఠారు అబ్బాయి చౌదరి, కోటగిరి శ్రీధర్ కేక్ కట్ చేశారు. విద్యార్థులకు సోట్ బుక్స్, పెన్నుల పంపిణీ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. అత్తిలి మండంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంచిపెట్టారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి, పలు సేవకార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో.. వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు కేక్ కట్ చేశారు. వైఎస్సార్ జిల్లాలో బైక్ ర్యాలీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర రెండు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల కోసం తమ అధినేత పాదయాత్ర చేస్తున్నారని కార్యకర్తలు తెలిపారు. శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పొద్దుటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ప్రత్యేక పూజలు పేద ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో ఐరాల కన్వీనర్ బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు ప్రజాసంకల్పయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా గుంటూరు నగర పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నేతలు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. లేళ్ల అప్పిరెడ్డి, ఆత్కూరి ఆంజనేయులు, పాదర్తి రమేష్, ఝాన్సీ, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో... వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం కాంతారావు ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు, ఉద్యోగులు. మొక్కు చెల్లించుకున్న వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్ సీపీ ఉభయగోదావరి జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరి జల్లా అయినవిల్లి విఘ్నేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు విజయవాడ కెనాల్ రోడ్డులోని వినాయకుడి ఆలయంలో మల్లాది విష్ణు, జోగి రమేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 200 కొబ్బరి కాయలు కొట్టారు. వైఎస్ జగన్ పాదయాత్ర 200 రోజులు పూర్తైన సందర్భంగా నెల్లూరు నగర పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. -
స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కాపు నాయకుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేయడానికి పూనుకున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ విమర్శించారు. స్థానిక జెడ్పీ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పాదయాత్ర గతంలో తుని తరహాలో హింసాత్మకం కాకూడనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాపులకు ఉద్యోగ, విద్యాపరమైన రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ ప్రణాళిక త్వరలో పూర్తి కాబోతుందని, ఎవరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కాపు కులస్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో బీసీలు కూడా సుముఖంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ద్వారా గతేడాది 80 వేల మందికి స్వయం ఉపాధి రుణాలు అందించామని ఈ ఏడాది 64 వేల మంది కాపులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన మాట వాస్తవమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్ధ చైర్మన్ పాలి ప్రసాద్, కాపు సంఘ నాయకురాలు ఎ.మాళవిక పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రకు కట్టుబడింది జగన్ ఒక్కరే
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమైక్య పాదయాత్రలు శనివారం జోరుగా సాగాయి. ఈ పాదయాత్రల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా అధికసంఖ్యలో పాల్గొని వైఎస్సార్ సీపీకి బాసటగా నిలిచారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ తమదేనని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్య నినాదం పాదయాత్రలో భాగంగా శనివారం రాజమండ్రిలోని జాంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణచౌదరితో కలిసి ఆదిరెడ్డి పాదయాత్ర చేశారు. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ పార్టీ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టి, రాష్ర్ట విభజన వల్ల కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ధవళేశ్వరం శివారు ఎర్రకొండలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఇందులో కూడా ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు వెంకట రమణచౌదరి పాల్గొన్నారు. కోరుకొండ మండలం గుమ్మలేరులో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బొడ్డు వెంకట రమణచౌదరి పాదయాత్ర నిర్వహిం చారు. పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అయినవిల్లిలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పట్టణంలోని 22వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు.