కరీంనగర్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం చిన్నకలవలలో మధునమ్మ అనే రైతు ఆత్మహత్య కు పాల్పడింది. అప్పుల బాధతో మధునమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్టు స్తానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.