అనంతపురం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రైతులతో సమావేశం అవుతారు. ఉదయం 10 గంటలకు బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో రైతులతో సమావేశం (ముఖాముఖి) అవుతారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రాజారాం తెలిపారు. పార్టీలకతీతంగా జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సహకారం తదితర అంశాలను నేరుగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రైతులు, రైతు సంఘాల నాయకులు తప్పక హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.