కుటుంబసభ్యులతో ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు.
ఎమ్మెల్యే ఆరోగ్యం కోసం పూజలు
నగరి : ఎమ్మెల్యే ఆర్కేరోజా పూర్ణారోగ్యంతో ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం నేత్రప్రదాత శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్ పాల్గొన్నారు.
నేసనూరులో..
పుత్తూరు: ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం నేసనూరులో గ్రామ దేవత శ్రీకలుగు లక్ష్మమ్మ ఆలయంలో సర్పంచి గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం, తిరుమలరెడ్డి, కుమార్, ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: రోజాకు ప్రముఖుల పరామర్శ
చదవండి: ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం
Comments
Please login to add a commentAdd a comment