Nagari MLA RK Roja
-
ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్: మంత్రి రోజా
సాక్షి, గుంటూరు: లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా పవన్ కల్యాణ్ దిగజారి పోతున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువు ఒక్కటే ముఖ్యం కాదని.. క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు మంత్రి రోజా. క్రిీడల వల్ల ఆరోగ్యం, ఆనందం వస్తుందన్నారు. ఎన్ని కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఎంత మంది నిందించినా విజయం ద్వారా సమాధానం చెప్పాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనటం ద్వారా దేశం తరుపున ఆడే గొప్ప అవకాశం లభిస్తుందని, అందుకోసం కృష్టి చేయాలని చెప్పారు. ‘నేను ఎన్నో అవమానాలు ఎదురైన వెనుదిరగకుండా ముందుకు వెళ్ళాను. ఆట ఏది అయిన మన లక్ష్యం సెక్సెస్‌పై మాత్రమే ఉండాలి. సీఎం వైఎస్ జగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసి ఉండరు. కానీ 151 సీట్లల్లో విజయంతో అందరికి సమాధానం చెప్పారు. లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా దిగజారి పోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్. హ్యాండ్ బాల్ ఆడే 22 మంది మెరికలాంటి యువకులకు శాప్ తరుపున అన్నివిధాల శిక్షణ ఇస్తున్నాము. శాప్‌కి సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు. ’ అని తెలిపారు మంత్రి రోజా. క్రీడల్లో కష్టపడుతున్న ఆటగాళ్లకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి రోజా. రాబోయే సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ‘జగనన్న క్రీడా సంబరాలు’ పేరుతో రూ.50 లక్షల నగదు బహుమతితో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడాకారులు పట్టుదలతో నేషనల్ నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని, క్రీడల్లో కష్టపడితే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తెలిపారు. ఇదీ చదవండి: నిపుణులు ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదు: స్పీకర్ తమ్మినేని -
ఐటీడీపీ అంటే ఇడియట్స్ టీడీపీ : మంత్రి రోజా
-
వందేళ్లకు సరిపడా వరాలు.. థాంక్యూ జగనన్న..
-
ఇంద్రభవనం లాంటి నటి రోజా ఇంటిని చూశారా?
MLA RK Roja Nagari Home Tour Video Goes Viral: ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, మరోపక్క బుల్లితెర హోస్ట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈమధ్య సినిమాలకు కాస్త విరామం ఇచ్చినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమం కోసం రోజా తన హెమ్ టూర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు యూట్యూబ్ వేదికగా తమ ఇంటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం రోజా తన హోం టూర్‌ని మాత్రం ఏకంగా టీవీలోనే విడుదల చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. నగరిలో ఇంద్ర భవనం లాంటి తన సొంతింటిని ఎమ్మెల్యే రోజా ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా అనంతరం పూజాగది, బెడ్ రూమ్, హాల్, పిల్లల రూమ్స్ సహా కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంతో విశాలవంతమైన, ఇంద్రభవనం లాంటి రోజా ఇంటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్.. ఆమెతో కలిసి గృహప్రవేశం -
నేషనల్ హైవేపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రోజా
-
రోజా కూతకు రాగానే మారుమోగిపోయిన స్టేడియం
-
చిత్తూరు జిల్లాలో రూ.50 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల నాడు నేడు
-
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోజా
-
వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌దే
-
వాలీబాల్ ఆడిన రోజా
-
వాలీబాల్ గేమ్ ఆడిన ఎమ్మెల్యే రోజా
-
పండగపూట తన ఇష్టాన్ని తెలిపిన రోజా
-
నగరి ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు
-
నగరి ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలిక బర్త్‌డే ఫొటోలు
-
కోలుకుని ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్యం కోసం పూజలు నగరి : ఎమ్మెల్యే ఆర్కేరోజా పూర్ణారోగ్యంతో ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం నేత్రప్రదాత శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్ పాల్గొన్నారు. నేసనూరులో.. పుత్తూరు: ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం నేసనూరులో గ్రామ దేవత శ్రీకలుగు లక్ష్మమ్మ ఆలయంలో సర్పంచి గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం, తిరుమలరెడ్డి, కుమార్, ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొన్నారు. చదవండి: రోజాకు ప్రముఖుల పరామర్శ చదవండి: ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం -
ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం మెరుగుపడాలని హోమం
పుత్తూరు రూరల్ః ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం స్థానిక ఈశ్వరాపురంలోని దుర్గాదేవి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి బృందం మహామృత్యుంజయ హోమం నిర్వహించింది. హోమం తర్వాత అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. 25వ వార్డు కౌన్సిలర్ కె.నరసింహారావు, వైఎస్సార్సీపీ నాయకులు మోహన్‌రెడ్డి, మునెయ్య, సీ.ఎం.దిలీప్, కృష్ణమరాజు, పాండు, నాగేంద్రబాబు, భరత్‌రాజు, సాయిరెడ్డి, మోహన్, బిజ్జిరాజు, మణి, రామ్‌బాబు, జ్ఙాన, తులసి, మణి, శశి, శివలింగం, తణివేలు, సునీల్, సాయి పాల్గొన్నారు. కౌన్సిలర్ల ఆధ్వర్యంలో అన్నదానం.. పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ మంగళవారం ఆలయాల్లో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎన్జీఓ కాలనీలోని గంగమ్మ ఆలయంలో కౌన్సిలర్ డి.జయప్రకాష్, ఆరేటమ్మ ఆలయంలో కౌన్సిలర్ వి.జయలక్ష్మి, తిమ్మపురంలోని గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయంలో కౌన్సిలర్ ఎన్.హేమలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు జాఫర్, శివ, శ్యామల, కె.మనోహర్‌రెడ్డి, వి.లోకనాధం, ఎ.లోకనాధం, కె.గాంధీరెడ్డి పాల్గొన్నారు. వేపగుంటలో.. పుత్తూరు: అందరి క్షేమాన్ని కాంక్షించే ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ.. వేపగుంట వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం గ్రామదేవత గూనెమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టారు. నాయకులు సర్పంచి బాలసుందరం, వైస్ సర్పంచి శాంతకుమార్, ఎంపీటీసీ అభ్యర్థి మునివేలు(బుజ్జి), నాయకులు లక్ష్మణమూర్తి, సుదర్శనం, నరసింహులు, సురేష్‌బాబు, జయకుమార్, రాజయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు మేజర్ శస్త్రచికిత్సలు -
కిలో ప్లాస్టిక్ తెస్తే కిలో బియ్యం : ఆర్కే రోజా
సాక్షి, నగరి : హానికర ప్లాస్టిక్ లేని సమాజాన్ని సృష్టించడానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా అడుగులు వేశారు. ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్ వస్తువులకు కిలో బియ్యం ఇచ్చే వినూత్న పథ కాన్ని ప్రారంభించారు. తొలిరోజే మంచి స్పందన లభించింది. అలాగే చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి టవర్‌క్లాక్ సెంటర్లో ట్రై సైకిళ్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక్కో పుట్టిన రోజు ఒక్కో పథకం వినూత్నంగా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అవాయిడ్ ప్లాస్టిక్.. సేవ్ నేచర్ నినాదంతో కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టామన్నారు. ప్లాస్టిక్ వస్తువు లు భూమిలో కలవడానికి 400 ఏళ్లు పడు తుందన్నారు. అందుకే దీనిపై పోరాటం మొదలుపెట్టామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో హానికర ప్లాస్టిక్ బ్యాన్ అయ్యేలా చూడాలని కోరారు. సీఎం జగన్ ఐదు నెలల పాలన ట్రైలర్ మాత్రమేనన్నారు. ఐదేళ్ల మెయిన్ పిక్చర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు వైఎస్.జగన్మోహన్రెడ్డే సీఎంగా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, సోదరులు కుమారస్వామిరెడ్డి, రామ్‌ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మురళిరెడ్డి, లక్ష్మీపతిరాజు, మాహిన్, కొండేటినాని, సుధాకర్ రెడ్డి, పరశురాం, బాలప్రసాద్, టీకేహరిప్రసాద్, గుణశేఖర్ పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఎమ్మెల్సీ మోకాలడ్డు
వడమాలపేట: నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అడ్డు తగులుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. మంగళవారం వడమాలపేటలో జరిగిన వైఎస్సార్సీపీ నగరి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు, పక్కాఇళ్లు లేక ప్రజ లు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నగరిలో డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, ఆ నీరువల్ల పలు చెరువుల నీరు కలుషితం కాకుండా ఈటీపీ ప్లాంటు ప్రారంభించడానికి కలెక్టర్‌తో మాట్లాడి కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నది ఆయన కాదా? అంటూ ప్రశ్నించారు. తాను ఏఅభివృద్ధి తలపెట్టినా తనకు ఎక్కడ మంచి పేరు వస్తుం దోనని అధికారులను బెదిరించి అడ్డుపడుతున్నారని ఆరో పించారు. గాలేరు– నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు దున్నపోతుపై వాన పడినట్లుగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు కోసం నగరి నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు మూసివేసి రైతులకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని, బకాయిలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించా రు. రైతులకు చెరుకు బకాయిలు చెల్లించేదాకా పోరాడతా నని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, అందుకే ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా పిల్లలు చదువుకుని ఖాళీ గా ఉన్నారని చెబుతున్నారని, అందుకోసమే పలు కంపెనీ లతో మాట్లాడి 17న పుత్తూరులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు చక్రపాణిరెడ్డి, కేజే కుమార్, ఏలుమలై (అమ్ములు), శ్యామ్‌లాల్, జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, బాబురెడ్డి, వడమాలపేట ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, మేరీ పాల్గొన్నారు. -
వెన్నుపోటే చంద్రబాబు నైజం
- ఖజానాలో డబ్బులు లే వంటూనే చైనా, జపాన్ టూర్లకు కోట్లు ఖర్చు - అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలకు దిక్కులేదు - కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రోజా విజయపురం (నిండ్ర) : వెన్నుపోటే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. బుధవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా కొప్పేడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంత రం సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. ‘అప్పుడు మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాకొన్నారని, ఇప్పుడు రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను వెన్నుపోటు పొడుస్తున్నారని’ ఆరోపించారు. చైనా పర్యటనలో రుణామా ఫీ చేసినట్లు ప్రచారం చేసుకోవడం హా స్యస్పదంగా ఉందన్నారు. మీలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా అని కార్యకర్తలను ప్రశ్నించగా, ‘నాకు రూ.9మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఓ రైతు నోరు విప్పడంతో.... ఇదండి చంద్రబాబు రుణమాఫీ’ అంటూ రోజా విమర్శించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తొలిరోజే ఒక్క సంతకంతో ప్రజలకు కోటి సమస్యలు తీరాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు కో టి సంతకాలు పెట్టిన ఒక్క సమస్య కూడా తీరేలా లేదని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు రుణామాఫీ చేస్తామంటూ మోసపూరిత హామీ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీని స్థాపించి సొంత అజెం డాతో 67 సీట్లు సంపాదించారన్నారు. మామ పెట్టిన పార్టీని లాక్కొని, డబ్బా లు కొట్టుకోవడం నిజమైన నాయకుడి లక్షణం కాదని, సొంతంగా పార్టీ పెట్టి, సొంత అజెండాతో గెలిచినప్పుడే నిజ మైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు ఖజానాలో డబ్బులు లేవంటూ, చైనా, జపాన్, సింగపూర్ టూర్లకు కోట్ల రూ పాయలను ఖర్చు చేయడం ఎంత వర కు న్యాయమని రోజా ప్రశ్నించారు. ఇప్పటికైన ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డి మాండ్ చేశారు. -
బాబువి హత్యారాజకీయాలు
- పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ధర్నా - డీఎస్పీని సస్పెండ్ చేసి, దౌర్జన్యకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ నగరి: చంద్రబాబు హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన గ్రామదేవతల ఊరేగింపులో రోజాపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివా రం ఉదయం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను అడుగడుగునా గొడవకు లాగి, ఆ దొమ్మీలో కొట్టడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం తదితర చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా కేజే కుమార్ నిర్వహి స్తున్న జాతరలో ఆడపడుచుగా తాను హారతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా వచ్చిన సమయంలో అడ్డుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఐదేళ్లుగా జాతర చేయనివారికి నేడు చేయాలని ఎందుకు బుద్ధి పుట్టిందన్నారు. వరుసగా జాతర చేయని వారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడానికే ఊరేగింపు పేరుతో వస్తున్నారని తాము ముందుగానే డీఎస్పీతో చెప్పామన్నారు. అయితే డీఎస్పీ వారికి మద్దతు పలుకుతూ తాను హారతి ఇచ్చే సమయంలో టీడీపీకి చెందిన వారిని రప్పించి హారతి పళ్లెం లాగేసి, దాడి చేయడంతో చేతికి గాయమైందన్నారు. ఆర్కేరోజాపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ సీపీ అండ గా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కరుణాకరరెడ్డి అన్నారు. మహిళా శాసన సభ్యురాలు, వైఎస్సార్ సీపీ మహిళావిభాగం రాష్ర్ట అధ్యక్షురాలుఆర్కేరోజా గొంతు నొక్కడానికే టీడీపీ నేతలు జాతరలో ఆమెపై హత్యాప్రయత్నమే చేశారని ఆరోపించారు. దీనికి డీఎస్పీ పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. టీడీపీ నేతలు, పోలీసులను పచ్చ కార్యకర్తలుగా వాడుకుంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుచరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలకు భయపడేవారెవరూ లేరన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల్లో ఏఒక్కరికి హాని కలిగినా రాష్ట్రంలోని పార్టీ నేతలంతా ఒక్కటై, వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. దళితుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులతో వైఎస్సార్సీపీ నాయకులను వేధింపులకు గురిచేయడానికి వాడుకుంటున్నారన్నారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అ న్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌ను మట్టుపెడితే నగరిలో వారికి ఎదురుం డదు అన్న ఆలోచనతోనే టీడీపీ నాయకులు పోలీసుల అండతో ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హత్యారాజకీయాలకు భ యపడేవారు ఎవరూ లేరని పుంగనూ రు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి ధ ర్నా కార్యక్రమానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేతో ఆ యన చర్చించారు. దాడి కేసులో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు నిందితులపై 307, 341 రెడ్‌విత్ 35 సెక్షన్ల కింద కేసు న మోదు చేసి, రెండు రోజుల్లోపు వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పూ తలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, జి ల్లా మహిళావిభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, మున్సిపల్ చైర్పర్సన్ కె. శాంతికుమార్, వైస్‌చైర్మన్ పీజీ నీల మేఘం, మాజీ చైర్మన్ కేజేకుమార్, కౌ న్సిలర్లు గౌరీరమేష్, పుష్పాగజేంద్రన్, రాజలింగం, గోవిందరాజులు, మోహన్‌రాజ్, నాయకులు జైలాబ్దీన్, అమ్ము లు, వెంకటరత్నం, భాస్కర్‌రెడ్డి, చం ద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రామమూర్తి, కృష్ణమూర్తి, బీఆర్వీ అయ్యప్పన్, కన్నాయిరం, మనోహర్‌నాయుడు, గుణశేఖర్రెడ్డి, జవహర్‌రెడ్డి, వరలక్ష్మి, భాస్కర్‌యాదవ్, అముద, తేన్మొళి, రహమాన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పసుపు చొక్కాలు వేసుకుని టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి నగరి: పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని, వారు పసుపు చొ క్కాలు వేసుకుని టీడీపీ సభ్యత్వం తీ సుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ కె.శాంతికుమార్ నివాసంలో ఎమ్మెల్యే ఆర్కేరోజాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కేరోజాపై దాడిప్రభుత్వ ప్రోత్సహంతోనే జరిగిందన్నా రు. దేవాలయాల్లో కూడా దాడి చేసే స్థాయికి టీడీపీ నాయకులు దిగినా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవ డం లేదని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోని మహిళా శాసన సభ్యురాలికే ఈ పరిస్థితి ఉంటే రా ష్ట్రంలో మహిళకు భద్రత ఏవిధంగా ఉందో తెలుస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో సెల్వమణి, కె.శాంతికుమార్, కేజే కుమార్ తదితరులు పాల్గొన్నారు.