![MLA RK Roja Undergo Surgery Fans Perform Maha Mrityunjaya Homam - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/31/2_0.jpg.webp?itok=y1egOvNT)
పుత్తూరు రూరల్ః ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం స్థానిక ఈశ్వరాపురంలోని దుర్గాదేవి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి బృందం మహామృత్యుంజయ హోమం నిర్వహించింది. హోమం తర్వాత అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. 25వ వార్డు కౌన్సిలర్ కె.నరసింహారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు మోహన్‌రెడ్డి, మునెయ్య, సీ.ఎం.దిలీప్, కృష్ణమరాజు, పాండు, నాగేంద్రబాబు, భరత్‌రాజు, సాయిరెడ్డి, మోహన్, బిజ్జిరాజు, మణి, రామ్‌బాబు, జ్ఙాన, తులసి, మణి, శశి, శివలింగం, తణివేలు, సునీల్, సాయి పాల్గొన్నారు.
కౌన్సిలర్ల ఆధ్వర్యంలో అన్నదానం..
పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ మంగళవారం ఆలయాల్లో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎన్‌జీఓ కాలనీలోని గంగమ్మ ఆలయంలో కౌన్సిలర్ డి.జయప్రకాష్, ఆరేటమ్మ ఆలయంలో కౌన్సిలర్ వి.జయలక్ష్మి, తిమ్మపురంలోని గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయంలో కౌన్సిలర్ ఎన్.హేమలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు జాఫర్, శివ, శ్యామల, కె.మనోహర్‌రెడ్డి, వి.లోకనాధం, ఎ.లోకనాధం, కె.గాంధీరెడ్డి పాల్గొన్నారు.
వేపగుంటలో..
పుత్తూరు: అందరి క్షేమాన్ని కాంక్షించే ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ.. వేపగుంట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మంగళవారం గ్రామదేవత గూనెమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టారు. నాయకులు సర్పంచి బాలసుందరం, వైస్ సర్పంచి శాంతకుమార్, ఎంపీటీసీ అభ్యర్థి మునివేలు(బుజ్జి), నాయకులు లక్ష్మణమూర్తి, సుదర్శనం, నరసింహులు, సురేష్‌బాబు, జయకుమార్, రాజయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment