సమావేశంలో మాట్లాడుతున్న నగరి ఎమ్మెల్యే రోజా
వడమాలపేట: నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అడ్డు తగులుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. మంగళవారం వడమాలపేటలో జరిగిన వైఎస్సార్‌సీపీ నగరి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు, పక్కాఇళ్లు లేక ప్రజ లు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నగరిలో డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, ఆ నీరువల్ల పలు చెరువుల నీరు కలుషితం కాకుండా ఈటీపీ ప్లాంటు ప్రారంభించడానికి కలెక్టర్‌తో మాట్లాడి కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నది ఆయన కాదా? అంటూ ప్రశ్నించారు. తాను ఏఅభివృద్ధి తలపెట్టినా తనకు ఎక్కడ మంచి పేరు వస్తుం దోనని అధికారులను బెదిరించి అడ్డుపడుతున్నారని ఆరో పించారు.
గాలేరు– నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు దున్నపోతుపై వాన పడినట్లుగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు కోసం నగరి నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు మూసివేసి రైతులకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని, బకాయిలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించా రు. రైతులకు చెరుకు బకాయిలు చెల్లించేదాకా పోరాడతా నని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, అందుకే ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా పిల్లలు చదువుకుని ఖాళీ గా ఉన్నారని చెబుతున్నారని, అందుకోసమే పలు కంపెనీ లతో మాట్లాడి 17న పుత్తూరులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు చక్రపాణిరెడ్డి, కేజే కుమార్, ఏలుమలై (అమ్ములు), శ్యామ్‌లాల్, జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, బాబురెడ్డి, వడమాలపేట ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, మేరీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment