బాబువి హత్యారాజకీయాలు | YSRCP MLA Roja injured in attack by TDP workers | Sakshi
Sakshi News home page

బాబువి హత్యారాజకీయాలు

Published Sun, Sep 14 2014 4:04 AM | Last Updated on Mon, Sep 17 2018 5:21 PM

బాబువి హత్యారాజకీయాలు - Sakshi

బాబువి హత్యారాజకీయాలు

- పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ధర్నా
- డీఎస్పీని సస్పెండ్ చేసి, దౌర్జన్యకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్
నగరి:
చంద్రబాబు హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన గ్రామదేవతల ఊరేగింపులో  రోజాపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివా రం ఉదయం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను అడుగడుగునా గొడవకు లాగి, ఆ దొమ్మీలో కొట్టడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం తదితర చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా కేజే కుమార్ నిర్వహి స్తున్న జాతరలో ఆడపడుచుగా తాను హారతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా వచ్చిన సమయంలో అడ్డుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు.

ఐదేళ్లుగా జాతర చేయనివారికి నేడు చేయాలని ఎందుకు బుద్ధి పుట్టిందన్నారు. వరుసగా జాతర చేయని వారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడానికే  ఊరేగింపు పేరుతో వస్తున్నారని తాము ముందుగానే డీఎస్పీతో చెప్పామన్నారు. అయితే డీఎస్పీ వారికి మద్దతు పలుకుతూ తాను హారతి ఇచ్చే సమయంలో టీడీపీకి చెందిన వారిని రప్పించి హారతి పళ్లెం లాగేసి,  దాడి చేయడంతో చేతికి గాయమైందన్నారు. ఆర్కేరోజాపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు.

ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ సీపీ అండ గా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కరుణాకరరెడ్డి అన్నారు. మహిళా శాసన సభ్యురాలు, వైఎస్సార్ సీపీ మహిళావిభాగం రాష్ర్ట అధ్యక్షురాలుఆర్కేరోజా గొంతు నొక్కడానికే టీడీపీ నేతలు జాతరలో ఆమెపై హత్యాప్రయత్నమే చేశారని ఆరోపించారు. దీనికి డీఎస్పీ పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. టీడీపీ నేతలు, పోలీసులను పచ్చ కార్యకర్తలుగా వాడుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుచరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు.

ఇలాంటి సంఘటనలకు భయపడేవారెవరూ లేరన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల్లో ఏఒక్కరికి హాని కలిగినా రాష్ట్రంలోని పార్టీ నేతలంతా ఒక్కటై, వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. దళితుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులతో వైఎస్సార్‌సీపీ నాయకులను వేధింపులకు గురిచేయడానికి వాడుకుంటున్నారన్నారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అ న్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌ను మట్టుపెడితే నగరిలో వారికి ఎదురుం డదు అన్న ఆలోచనతోనే టీడీపీ నాయకులు పోలీసుల అండతో ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ హత్యారాజకీయాలకు భ యపడేవారు ఎవరూ లేరని పుంగనూ రు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి ధ ర్నా కార్యక్రమానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేతో ఆ యన చర్చించారు. దాడి కేసులో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు నిందితులపై 307, 341 రెడ్‌విత్ 35 సెక్షన్ల కింద కేసు న మోదు చేసి, రెండు రోజుల్లోపు వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా విరమించారు.

ఈ కార్యక్రమంలో పూ తలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, జి ల్లా మహిళావిభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ కె. శాంతికుమార్, వైస్‌చైర్మన్ పీజీ నీల మేఘం, మాజీ చైర్మన్ కేజేకుమార్, కౌ న్సిలర్లు గౌరీరమేష్, పుష్పాగజేంద్రన్, రాజలింగం, గోవిందరాజులు, మోహన్‌రాజ్,  నాయకులు జైలాబ్దీన్, అమ్ము లు, వెంకటరత్నం, భాస్కర్‌రెడ్డి, చం ద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రామమూర్తి, కృష్ణమూర్తి, బీఆర్వీ అయ్యప్పన్, కన్నాయిరం, మనోహర్‌నాయుడు, గుణశేఖర్‌రెడ్డి, జవహర్‌రెడ్డి, వరలక్ష్మి, భాస్కర్‌యాదవ్, అముద, తేన్‌మొళి, రహమాన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
పసుపు చొక్కాలు వేసుకుని టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి
నగరి: పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని, వారు పసుపు చొ క్కాలు వేసుకుని టీడీపీ సభ్యత్వం తీ సుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ కె.శాంతికుమార్ నివాసంలో ఎమ్మెల్యే ఆర్కేరోజాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కేరోజాపై దాడిప్రభుత్వ ప్రోత్సహంతోనే జరిగిందన్నా రు.

దేవాలయాల్లో కూడా దాడి చేసే స్థాయికి టీడీపీ నాయకులు దిగినా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవ డం లేదని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోని మహిళా శాసన సభ్యురాలికే ఈ పరిస్థితి ఉంటే రా ష్ట్రంలో మహిళకు భద్రత ఏవిధంగా ఉందో తెలుస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో సెల్వమణి,  కె.శాంతికుమార్, కేజే కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement