- ఖజానాలో డబ్బులు లే వంటూనే చైనా, జపాన్ టూర్లకు కోట్లు ఖర్చు
- అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలకు దిక్కులేదు
- కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రోజా
విజయపురం (నిండ్ర) : వెన్నుపోటే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. బుధవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా కొప్పేడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంత రం సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. ‘అప్పుడు మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాకొన్నారని, ఇప్పుడు రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను వెన్నుపోటు పొడుస్తున్నారని’ ఆరోపించారు.
చైనా పర్యటనలో రుణామా ఫీ చేసినట్లు ప్రచారం చేసుకోవడం హా స్యస్పదంగా ఉందన్నారు. మీలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా అని కార్యకర్తలను ప్రశ్నించగా, ‘నాకు రూ.9మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఓ రైతు నోరు విప్పడంతో.... ఇదండి చంద్రబాబు రుణమాఫీ’ అంటూ రోజా విమర్శించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తొలిరోజే ఒక్క సంతకంతో ప్రజలకు కోటి సమస్యలు తీరాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు కో టి సంతకాలు పెట్టిన ఒక్క సమస్య కూడా తీరేలా లేదని విమర్శించారు.
తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు రుణామాఫీ చేస్తామంటూ మోసపూరిత హామీ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీని స్థాపించి సొంత అజెం డాతో 67 సీట్లు సంపాదించారన్నారు. మామ పెట్టిన పార్టీని లాక్కొని, డబ్బా లు కొట్టుకోవడం నిజమైన నాయకుడి లక్షణం కాదని, సొంతంగా పార్టీ పెట్టి, సొంత అజెండాతో గెలిచినప్పుడే నిజ మైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు ఖజానాలో డబ్బులు లేవంటూ, చైనా, జపాన్, సింగపూర్ టూర్లకు కోట్ల రూ పాయలను ఖర్చు చేయడం ఎంత వర కు న్యాయమని రోజా ప్రశ్నించారు. ఇప్పటికైన ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డి మాండ్ చేశారు.
వెన్నుపోటే చంద్రబాబు నైజం
Published Fri, May 1 2015 6:02 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement
Advertisement