కిలో ప్లాస్టిక్‌ తెస్తే కిలో బియ్యం : ఆర్కే రోజా | RK Roja Steps In To Create A Community Free Of Harmful Plastic | Sakshi
Sakshi News home page

కిలో ప్లాస్టిక్‌ తెస్తే కిలో బియ్యం : ఆర్కే రోజా

Published Mon, Nov 18 2019 6:52 AM | Last Updated on Mon, Nov 18 2019 6:52 AM

RK Roja Steps In To Create A Community Free Of Harmful Plastic - Sakshi

ప్లాస్టిక్‌ తెచ్చిన వారికి బియ్యం అందిస్తున్న ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా

సాక్షి, నగరి : హానికర ప్లాస్టిక్‌ లేని సమాజాన్ని సృష్టించడానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా అడుగులు వేశారు. ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్‌ వస్తువులకు కిలో బియ్యం ఇచ్చే వినూత్న పథ కాన్ని ప్రారంభించారు. తొలిరోజే మంచి స్పందన లభించింది. అలాగే చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి టవర్‌క్లాక్‌ సెంటర్‌లో ట్రై సైకిళ్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ఒక్కో పుట్టిన రోజు ఒక్కో పథకం వినూత్నంగా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అవాయిడ్‌ ప్లాస్టిక్‌.. సేవ్‌ నేచర్‌ నినాదంతో కిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టామన్నారు. ప్లాస్టిక్‌ వస్తువు లు భూమిలో కలవడానికి 400 ఏళ్లు పడు తుందన్నారు.

అందుకే దీనిపై పోరాటం మొదలుపెట్టామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో హానికర ప్లాస్టిక్‌ బ్యాన్‌ అయ్యేలా చూడాలని కోరారు. సీఎం జగన్‌ ఐదు నెలల పాలన ట్రైలర్‌ మాత్రమేనన్నారు. ఐదేళ్ల మెయిన్‌ పిక్చర్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, సోదరులు కుమారస్వామిరెడ్డి, రామ్‌ప్రసాద్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, మురళిరెడ్డి, లక్ష్మీపతిరాజు, మాహిన్, కొండేటినాని, సుధాకర్‌ రెడ్డి, పరశురాం, బాలప్రసాద్, టీకేహరిప్రసాద్, గుణశేఖర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement