తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి | BRS MLA Padi Kaushik Reddy Comments After House Arrest, Check Out The Details | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

Published Fri, Sep 13 2024 2:39 PM | Last Updated on Fri, Sep 13 2024 5:58 PM

BRS MLA Padi Kaushik Reddy Comments After House Arrest

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఫిరాయింపుదారులను 4 వారాల్లో డిస్‌క్వాలిఫై చేయాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు. అరికెపూడి గాంధీ తన సంగతి చూస్తామంటున్నారని.. తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధమని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారన్న కౌశిక్‌ రెడ్డి..  తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారన్నారు కౌశిక్‌ రెడ్డి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని తాను,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరగా.. హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. తన ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటిపై దాడి చేయాలని చెప్పారని ఆరోపించారు.తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన కౌశిక్‌ రెడ్డి.. తానుచేసిన తప్పు ఏంటని మండిపడ్డారు. 

కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ..

  • అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.
  • స్వయంగా అరికెపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.
  • అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?
  • నేను ఉండేడే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.
  • అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ఉంటారు.
  • నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నాను.
  • ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.
  • చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా,తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.
  • హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.
  • రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
  • రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్‌లో  హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.
  • రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు
  • రేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అవసరం లేదు
  • కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.
  • బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.
  • కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా?
  • కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా?
  • రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి.
  • మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారు.
  • నిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్‌కు  తీసుకువెళ్లారు.
  • బిఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.
  • పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.
  • ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు.
  • నాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలు.
  • హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.
  • పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.
  • కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
  • ఇప్పటికైనా సిగ్గు, శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.
  • నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయం
  • పీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది. 
  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.
  • దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ ఉంది.
  • దానం ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.
  • నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.
  • నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.
  • కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.
  • ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.
  • సెటిలర్స్‌ను మా నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

కాగా  ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శంభీపూర్‌ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహనిర్భంధంలో ఉంచారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా అని నిలదీశారు. గాంధీ ఇంటికి పోతామంటే ఎందుకు ఆపుతున్నారని అడిగారు.

మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిని పోలీసులు శంభీపూర్‌ రాజు ఇంట్లో గృహనిర్భందం చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం వరకు కౌశిక్‌ రెడ్డి హౌస్‌ అరెస్టు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement