హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ పార్టీపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను పీఏసీ చైర్మన్‌గా నియమించింది. ఈ నియామకంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది.
ఇది చిలికి చిలికి గాలివానగా మారి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసేదాకా వెళ్లింది. గాంధీ ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతోనే కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలి. ఆయన ఇంటికి వెళ్లి మా పార్టీ కండువా కప్పుతా’’ అంటూ కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ క్రమంలో తాజాగా అరికెపూడి గాంధీ కౌంటర్ గా తీవ్ర పదజాలమే ఉపయోగించారు.
‘‘కౌశిక్ రెడ్డి ఊరు మీద పడ్డ ఆంబోతు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా కూడా ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లేది లేదు. ఆ పార్టీలో బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా?’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అంతకు ముందు.. కౌశిక్ రెడ్డికి కౌంటర్‌గా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ ప్రతిసవాల్ విసిరారు.
చదవండి: సవాళ్ల పర్వం.. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment