డాలస్: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడవ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని డాలస్ నగరంలో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు సంయుక్తంగా రెడ్ క్రాస్ కోసం రక్తదానం దేశారు. పలువురు అమెరికన్లు సైతం మహానేత వర్ధంతి సందర్భంగా రక్తదానం చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ యూఎస్ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొఆర్డినేటర్ డాక్టర్ రామిరెడ్డి బూచిపూడి, ఐటీ వింగ్ కన్వీనర్ డాక్టర్ నాగిరెడ్డి దుర్గారెడ్డి, వెబ్ కమిటీ ఇన్ చార్జి విశ్వనాధ్ విచ్చిలి, వైఎస్సార్ సీపీ డాలస్ సిటీ కోఆర్డినేటర్లు సుబ్బారడ్డి కొండు, కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ డాలస్ కోర్ కమిటీ మెంబర్లు రవి అరిమండ, ఉమా కుర్రి, చందు, జయసింహ పాలగల, తిరుమల రెడ్డి కుంభం, వైఎస్సార్ అభిమానులు శ్రీనాథ్ రెడ్డి పలవల, చెన్నారెడ్డి కొర్వి, ప్రసాద్ రెడ్డి చొప్పా, ఫల్గున్ రెడ్డి, శివారెడ్డి అన్నపురెడ్డి, సతీశ్ సీరం, సుధాకర్, సతీశ్ తియ్యగూర, నాగరాజు రెడ్డి, యశ్వంత్, ప్రసాద్ రెడ్డి సూరపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతిఏటా రక్తదానాలు చేస్తుండటం అభినందనీయమని అమెరికన్ రెడ్ క్రాస్ వారు పేర్కొన్నారు.