న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం | ysrcp foundation held blood donation camp in new jercy | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

Published Sun, Sep 13 2015 7:46 PM | Last Updated on Tue, May 29 2018 3:43 PM

న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం - Sakshi

న్యూజెర్సీలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ ఫౌండేషన్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో ఫిలడెల్ఫియా ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపు 500 మంది ప్రవాస భారతీయులు అక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 130 మంది రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమాన్ని సమంగా చూశారని శ్రీకాంత్‌రెడ్డి కొనియాడారు. అందుకే ఆయనను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మరచిపోలేకపోతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement