సాక్షి, చెన్నై: నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో భరోసానిచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఇదే విషయాన్ని చెన్నైలోని భారత్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ముక్తకంఠంతో చెప్తున్నారు. అందుకే బుధవారం జన నేతకు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. అభిమానంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.
చెప్పాడంటే.. చేస్తాడంతే అన్నది నిజం చేస్తూ.. రైతుల పాలిట ఆపద్భాందవుడుగా మారాడని, బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా వెలుగుతున్నాడని ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు వైఎస్ జగన్‌ను కొనియాడారు. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సీఎం జగన్ ప్రజా సంక్షేమ సారథిగా ఎదిగారని మరికొందరు విద్యార్థులు చెప్పారు. పేదింటి పెద్ద కొడుకుగా, అవ్వాతాతల ముద్దుల మనవడిగా, ఆడపడుచులకు అన్నగా, విద్యార్థులకు మేనమామగా, సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్లు.
ఈ కార్యక్రమంలో సైకం రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డి, నరేష్, కార్తీక్, అజయ్ తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment