Chennai University
-
చెన్నై: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
సాక్షి, చెన్నై: నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో భరోసానిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఇదే విషయాన్ని చెన్నైలోని భారత్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ముక్తకంఠంతో చెప్తున్నారు. అందుకే బుధవారం జన నేతకు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. అభిమానంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెప్పాడంటే.. చేస్తాడంతే అన్నది నిజం చేస్తూ.. రైతుల పాలిట ఆపద్భాందవుడుగా మారాడని, బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా వెలుగుతున్నాడని ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు వైఎస్ జగన్‌ను కొనియాడారు. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సీఎం జగన్ ప్రజా సంక్షేమ సారథిగా ఎదిగారని మరికొందరు విద్యార్థులు చెప్పారు. పేదింటి పెద్ద కొడుకుగా, అవ్వాతాతల ముద్దుల మనవడిగా, ఆడపడుచులకు అన్నగా, విద్యార్థులకు మేనమామగా, సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్లు. ఈ కార్యక్రమంలో సైకం రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డి, నరేష్, కార్తీక్, అజయ్ తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. -
విదేశీ విద్యార్థులపై దాడి
టీనగర్ : చెన్నై వర్సిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్, చెన్నై వరద బాధితుల గురించి ఫీల్డు వర్కు పేరిట సమావేశం మంగళవారం జరిగింది. చెన్నై వర్సిటీ వైస్ చాన్స్‌లర్ తాండవన్, ఐఏఎస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశంలో వర్సిటీకి చెందిన ఎంఏ రెండవ ఏడాది ఫ్రాన్స్ దేశపు విద్యార్థి జోనస్ ఆంటన్ పులేంద్ర రాసా పాల్గొని వరద చర్యలపై ప్రశ్నించారు. ఆ విద్యార్థిపై ఎగ్జామినేషన్ కంట్రోలర్ తిరుమగన్, ప్రొఫెసర్ మదురై వీరన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశన్ దాడి చేసి బయటకు గెంటివేశారు. దీనిని ఖండిస్తూ 20మందికి పైగా విద్యార్థులు వర్సిటీలో ఆందోళనలు జరిపారు. అక్కడికి చేరుకున్న వర్సిటీ నిర్వాహకులు కొందరు ఆందోళనలో పాల్గొన్న వారిపై దాడి జరిపారు. టాంజానియా దేశపు విద్యార్థి పాప్పు కూడా దాడికి గురయ్యారు. ఈ క్రమంలో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ వైస్ చాన్సలర్‌కు విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు. అయితే ఆయన దీనిని నిరాకరించారు. బుధవారం ఎస్ ఎఫ్ ఐ, వర్సిటీ విద్యార్థులు 42 మంది ఫ్రాన్స్, టాంజానియా విద్యార్థులు దాడికి గురవడాన్ని ఖండిస్తూ వర్సిటీలో ఆందోళనలు జరిపారు. ముఖ్యమంత్రి జయలలిత సచివాలయానికి ఆ మార్గం గుండా వెళ్లనుండడంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని బలవంతంగా వారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఫ్రాన్స్ విద్యార్థి జోనస్‌పై దాడి గురించి రాయబారి కార్యాలయంలో ఫిర్యాదు అందింది. అన్నావర్సిటీ పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. విదేశీ విద్యార్థుల దాడి గురించి ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందిందని, విద్యార్థులపై దాడి గురించి విడివిడిగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం అందింది.