వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సందర్భంగా సేవా కార్యక్రమాలు | blood donation camp and service programmes due to YS Jagan birthday | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సందర్భంగా సేవా కార్యక్రమాలు

Published Wed, Dec 20 2017 10:47 PM | Last Updated on Wed, Jul 25 2018 4:58 PM

blood donation camp and service programmes due to YS Jagan birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్: రేపు (డిసెంబర్ 21న) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. జననేత వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రక్తదానం కార్యక్రమం ప్రారంభించనున్నారు. రక్తదాన శిబిరంతో మరిన్ని సేవా కార్యక్రమాలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement