రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ రక్తదానం
హైదరాబాద్ : నేడు జాతీయ రక్తదాన దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో భారీ ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది. అన్ని దానాల్లో కెల్ల రక్తదానం మిన్న. రక్తదాన ప్రాముఖ్యతను గుర్తించి.. రక్త దానంపై అవగాహన కలిపించడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి కృష్టి చేస్తోంది.
మనమంతా తెలుగువారం. మనది తెలుగు రక్తం. ఈ రక్తంలో ఎలాంటి కల్మషం లేదు. ఏకరూపత ఉంది. ఐక్యత కూడా కనిపిస్తుంది. అందుకే తెలుగు రక్తం ప్రవహించే మనమంతా ఒక్కటే.. అనే స్ఫూర్తితో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. అక్టోబర్ 1న జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రక్తదానానికి సంబంధించిన పోస్టర్‌ను వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇటీవలే విడుదల చేశారు.
అందరికీ ఆరోగ్యం అన్నది మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. ఆదే స్ఫూర్తితో ఆ మహానేత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. అది ఎందరికో ప్రాణదానం చేసింది.. చేస్తోంది. ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆదే ఒరవడిని కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి.. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను రక్తదానం చేయాలంటూ ప్రోత్సహిస్తోంది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది.
సామాజిక బాధ్యతలో భాగంగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా కృషి చేస్తోంది. గత ఏడాది కూడా నిర్వహించిన రక్తదాన శిబిరానికి పార్టీ నేతలు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిఏటా శిబిరాలను నిర్వహిస్తోంది. రక్తాన్ని దానం చేయండి.. ప్రాణాన్ని కాపాడండి అని పార్టీ నేతలు ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది.
జాతీయ రక్తదాన దినోత్సవం సందర్బంగా ఖమ్మంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో పొంగులేటి స్వరాజ్యం-రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. శివభరత్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా పార్టీ కన్వీర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు శిబిరంలో పాల్గొన్నారు.