బెల్లంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : బెల్లంపల్లిలోని కల్వరి మినిస్ట్రీ చర్చిలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 200 మంది ఉచితంగా రక్తం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.