సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం | STS held Blood donation camp in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం

Published Sun, Jul 12 2020 11:26 AM | Last Updated on Sun, Jul 12 2020 11:28 AM

STS held Blood donation camp in Singapore - Sakshi

సింగపూర్ : రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్థానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్‌లో సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్త దానం చేశారు. కోవిడ్-19 సురక్షిత చర్యల్లో భాగంగా ముందుగా నమోదు చేసుకొన్న 100 మందికి మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం కల్పించామని నిర్వాహకులు సోమ రవి తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, రెడ్ క్రాస్- బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement