STs
-
హిందూ వివాహ చట్టప్రకారం ఎస్టీలు విడాకులు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: హిందూ వివాహ చట్టప్రకారం వివాహం చేసుకున్న ఎస్టీలకు అదే చట్టప్రకారం విడాకులు ఇవ్వవచ్చని.. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన ఓ గిరిజన (లంబాడ) దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్టీకి చెందిన వారికి హిందూ వివాహ చట్టం సెక్షన్ 2(2) వర్తించదని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు పూర్తిగా హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారని.. పెళ్లి కార్డు సహా ఇతర ఆధారాలన్నీ పరిశీలించాల్సిన ట్రయల్ కోర్టు ఆ పని చేయలేదన్నారు. హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2).. ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్సీలకు వర్తించదని, ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తున్నామన్నారు. -
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం
సింగపూర్ : రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్థానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్‌లో సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్త దానం చేశారు. కోవిడ్-19 సురక్షిత చర్యల్లో భాగంగా ముందుగా నమోదు చేసుకొన్న 100 మందికి మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం కల్పించామని నిర్వాహకులు సోమ రవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, రెడ్ క్రాస్- బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
నెలాఖరు వరకు మరిన్ని విమానాలు : కిషన్ రెడ్డి
సింగపూర్ : కరోనా ప్రభావంతో సింగపూర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారి సమస్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గంతో జూమ్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారితో పాటు అనేక రాష్ట్రాలవారి కోసం అదనపు విమానాలను ఏర్పాటు చేయడంలో కృషిచేసినందుకు కిషన్ రెడ్డికి సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్-19 నివారణలో భాగంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులను, భారత ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించారు. మేకిన్ ఇండియాలో భాగంగా సొంతంగా భారతదేశం మాస్కులను, పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలను తయారుచేసి ఇతర దేశాలకు కూడా సహాయం చేసే స్ధాయికి ఎదిగామన్నారు. అంతేకాకుండా హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ఔషధాలను అనేకదేశాలకు ఆపదలో అందించామన్నారు. విదేశాల్లో చిక్కుకొన్నవారికోసం వందేభారత్ మిషన్‌ను ప్రారంభించి విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సింగపూర్ తెలుగు సమాజం విజ్ఞప్తి మేరకు మలివిడతలో కూడా నెలాఖరు వరకు మరిన్ని విమానాలను వీలైతే మరిన్ని గమ్యస్థానాలకు కూడా సమకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అత్యవసరాలు ఉన్నవారికి సింగపూర్ తెలుగు సమాజం స్వయంగా చార్టెడ్ విమానం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈసమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారులు భరత్ రెడ్డి, కపిల్ ఏరో ఇండియా లిమిటెడ్ వ్యవస్ధాపకులు చిన్నబాబు పాల్గొన్నారు. ఈ మిషన్‌లో భాగంగా సహాయసహకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ, నిరంతరంగా శ్రమ పడుతున్న హైకమీషన్ వారికి సమాజ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఈనెల 17న హైదరాబాద్ బయలుదేరుతుందని తెలిపారు. -
కార్మికులకు ఎస్టీఎస్ బీమా సౌకర్యం
సింగపూర్ : మే డే సందర్భంగా కార్మిక సోదరులకు సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటికే బీమా కంపెనీ ప్రతినిధులతో చర్చించామని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి తెలిపారు. మేడే సందర్భాన్ని పురస్కరించుకుని వీడియో కాల్ ద్వారా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యంగా ఉండాలని , ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించి, జాగ్రత్తతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాక్షించారు. కరోనా అదుపులోకి వచ్చి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కార్మికుల నివాసాల్ని సందర్శించాలని కమిటీ నిర్ణయించింది. -
ఎస్టీఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
సింగపూర్ : రెండు రోజులపాటు సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. మొదటిరోజు వామనగుంటలు, దాడి, పచ్ఛీసు, అష్టాచమ్మా, పరమపదసోపానం, గోళీలాట, బొంగరాలు , గాలిపటాలు మొదలగు సంప్రదాయ ఆటలు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, సంక్రాంతి లక్ష్మిపూజ, హరిదాసు, గొబ్బిళ్ళ ఆటపాటల కోలాహలంతో అచ్ఛతెలుగు సంక్రాంతి శోభ ఉట్టిపడింది. అనంతరం స్ధానిక బాలబాలికలు, యువతీ యువకులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా రాజమండ్రి నుంచి విచ్చేసిన గాయనీగాయకులు నవీన్, భవ్యలతో నిర్వహించిన సినీ గాన విభావరి అందరినీ ఉర్రూతలూగించింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సంబరాలలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు 2020 క్యాలెండెర్ను ఆవిష్కరించారు. అచ్ఛమైన సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలతో కూడిన తెలుగు సాంప్రదాయ భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది. రెండవరోజు హైదరాబాద్ నుంచి విచ్చేసిన గాన విద్యా ప్రవీణ, ప్రముఖ శాస్త్రీయ లలిత సంగీత గాయకులు, స్వరకర్త గరికపాటి వెంకట ప్రభాకర్‌తో నిర్వహించిన వైవిధ్యభవితమైన రాగావధానం సింగపూర్ వాసులను విశేషంగా ఆకట్టుకొంది. అనేకరాగాలలో పృచ్ఛకులు అడిగిన అంశాలతో ప్రభాకర్ అద్వితీయంగా, అలవోకగా గానంతో సమాధానం ఇచ్చి ప్రేక్షకుల అభినందనలను పొందారు. దీనిలో భాగంగా అవధాని ద్వారా శిక్షణ పొందిన సింగపూర్ బాలబాలికలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అనంతరం తెలుగు సమాజం కార్యవర్గం ప్రభాకర్‌ని ఘనంగా సన్మానించారు. ఈ అవధాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతిఒక్కరికీ నిర్వాహకులు నరాల సిద్దారెడ్డి, మల్లిక్ పాలెపు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వహణ కార్యదర్శి ప్రదీప్ సుంకర, శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి భోగి పండుగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగుపండ్ల ప్యాకెట్లని ఉచితంగా పంపిణీ చేశారు. ఆహ్లాదభరితంగా జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు, కార్యవర్గానికి, కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం
సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని సింగపూర్ లోని పాయ లేబర్, శ్రీ శివన్ దేవాలయం ప్రాంగణంలో జరిపించారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రభాత సేవతో మొదలై ఏకాంత సేవ వరకు జరిగిన విశేషసేవలకు భారీగా భక్తులు తరలి వచ్చారు. సింగపూర్‌తో పాటు మలేషియా నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి తిరుమల ఉత్సవ అనుభూతిని పొందారు. కన్నుల పండగగా జరిగిన ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, చిన్నారుల నాట్యాలు, మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అతి తక్కువ సమయంలో అత్యంత వేడుకగా కళ్యాణమహోత్సవాన్ని చేయడంలో కీలక పాత్ర వహించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని కొనియాడారు. తిరుమల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి టీటీడీ కార్యవర్గం చర్యలు తీసుకుంటుందన్నారు. విదేశాల నుండి వచ్చే భక్తుల కోసం మరింత శీఘ్రగతిన దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ బోర్డ్ మెంబర్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. మాట్లాడుతూ సింగపూర్‌లో ఎన్నో దేవాలయాలు ఉండడం ఆనందంగా ఉందని, ఇక్కడి భారతీయుల భక్తి ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో సింగపూర్ హోమ్, న్యాయశాఖా మంత్రివర్యులు కె షణ్ముగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు యస్ ఈశ్వరన్, సింగపూర్ దేశ భారత రాయభారి జావెద్ అష్రాఫ్, హిందూ ఎండోమెంట్ బోర్డ్ ఛైర్మన్ ఆర్ జయచంద్రన్, శివన్ దేవాలయ సలహాదారు దినకరన్, శివన్ దేవాలయ ఛైర్మన్ వెంకటేష్, శివన్ దేవాలయ కార్యదర్శి టి అన్బలగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ సావనీర్ ను ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించారు. పుష్కర కాలం తర్వాత ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించడానికి తోడ్పాటునందించిన టీటీడీ యాజమాన్యానికి, స్థానిక హిందూ ఎండోమెంట్ బోర్డు, శివన్ టెంపుల్ యాజమాన్యానికి సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సింగపూర్ భక్తులకి ఈ కార్యక్రమం ద్వారా కలగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో అహర్నిశలు శ్రమించిన కుటుంబ సమేత కార్యవర్గ సభ్యులు జ్యోతీశ్వర్ రెడ్డి కురిచేటి, నగేష్ టేకూరి, అనిల్ పోలిశెట్టి, సత్య సూరిశెట్టి, మల్లికార్జున్ పాలేపు, వెంకట వినయ్ కుమార్ గౌరిరెడ్డి, ప్రదీప్ సుంకర, సిద్దా రెడ్డి నరాల, భూమ్ రాజ్ రుద్ర, మహేష్ కాకర్ల, సోమా రవి కుమార్, ధర్మ వర ప్రసాద్ బచ్చు, సమ్మయ్య బోయిని, కాసయ్య మేరువ, స్వాతి కురిచేటి, విజయ చిలకల్, సుప్రియ కొత్త, వెంకట శివ రావు పులిపాటి, నరసింహ గౌడ్ పోతగౌని, శ్రీనివాస రెడ్డి పుల్లన్నగారి, నాగరాజు వడ్డి, ఫణింద్ర వర్మ కలిదిండి, అర్జున్ రావు జునెబోయిన లకు సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి చిర్ల దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వాలంటీర్లకు, దాతలకు, సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరున తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలి
సాక్షి, ఆసిఫాబాద్: ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆదివాసీల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం 79వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కుమురం భీం జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గొడెం నగేశ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఉట్నూర్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, కుమురం భీం మనవడు సోనే రావు, 9 ఆదివాసీ తెగల నేతలు హాజరయ్యారు. ముందుగా భీం స్మారకం, సమాధి వద్ద ఆదివాసీ డప్పు చప్పుల మధ్య పూజలు చేసి నివాళులర్పించారు. -
అక్టోబర్ 12, 13న సింగపూర్‌లో తిరుమల శ్రీవారి కల్యాణం
సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో అక్టోబర్ 12,13న అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణమహోత్సవం నిర్వహించేందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణోత్సవానికి శ్రీవారు, శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల నుండి సింగపూర్‌వాసులను కరుణించడానికి రానున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్ధానాలకు చెందిన అర్చకులు, వేదపండితులు తిరుమల క్షేత్రం నుంచి వచ్చి సింగపూర్‌లో ఆ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని, ఇతర కైంకర్య సేవలను తిరుమలలోలానే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇటువంటి సేవలు సింగపూర్‌లో నివసించే అందరికీ, తిరుమల వెళ్ళలేని వారికి కూడా ఇవి అందుబాటులో ఉండేలా, అందరినీ తరింపచేయాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాల చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, తుడా ఛైర్మన్, టీటీడి బోర్డ్ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర దేవస్ధాన అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరుకానున్నారు. గేలాంగ్ ఈస్ట్ అవెన్యూ 2, శ్రీ శివన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఓపెన్ లాన్స్ ఈ మహోత్సవానికి వేదిక కానుంది. దేదీప్యమానంగా జరగనున్న ఈ వేడుకలో భక్తజనం అందరూ పాల్గొని కనులారా తిలకించి, తరించి, తీర్ధప్రసాదాలు, తిరుపతి లడ్డుప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని సింగపూర్ తెలుగు సమాజం కోరింది. -
చిన్నారికి అండగా సింగపూర్ వాసులు
అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వరెణ్య(6)కు సహాయం అందించడానికి సింగపూర్ వాసులు ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పిప్రీకి చెందిన దుర్గి నరేందర్ గౌడ్ కుమార్తె వరెణ్య తీవ్రమైన మైలాయిడ్ లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. అత్యవసరంగా కీమోథెరపీ చేపించాలని డాక్టర్లు సూచించారు. దీంతో తమ చిన్నారిని కాపాడాలని పేదవారైన ఆ తల్లిదండ్రులు తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ తెలుగుసమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి చొరవతో విరాళాలు ఇవ్వడానికి గ్రూపు సభ్యులు ముందుకొచ్చారు. మూడు లక్షల రూపాయలను చిన్నారి తండ్రికి విరాళంగా అందించారు. విరాళాలు అందించిన వారందరికి వరెణ్య తండ్రి నరేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే వరెణ్య చికిత్సకు మరింత డబ్బు అవసరం అవ్వడంతో ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయగలిగితే దయచేసి కింద పేర్కొన్న అకౌంట్‌కి పంపించాలని కోరారు. వరెణ్య తండ్రి దుర్గి నరేందర్ గౌడ్ బ్యాంక్ అకౌంట్: D Narendhar Goud A / C NO : 621 681 75707 IFSC NO : SBIN 0020374 SBI BHEEMGAL -
పేదలకు రుణాల్లోనూ మోసమే
సాక్షి, అమరావతి: పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని భారీయెత్తున ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయా వర్గాల వారిని నిలువునా మోసం చేసింది. సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ నెపాన్ని బ్యాంకులపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీంతో 14 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మెగా రుణ మేళాలు నిర్వహించి సబ్సిడీతో రుణాలు ఇస్తామని ప్రచారం చేయడంతో సుమారు 15 లక్షల మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2015–16లో అరకొరగా రుణాలిచ్చిన ప్రభుత్వం అప్పటికి ఆ కార్యక్రమాన్ని ముగించేసింది. ఆ తర్వాత 2016–17, 2017–18, 2018–19 మూడు సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వకుండా ఎగనామం పెట్టింది. దరఖాస్తుదారులైన పేదలు, నిరుద్యోగులు తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడిస్తారంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, నేతలను నిలదీస్తుండటం, ఈలోగా ఎన్నికలు సమీపించడంతో గత జనవరిలో రుణ మేళాల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంది. ప్రచారార్భాటానికి రూ.4 కోట్ల వ్యయం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికైతే మహిళలు, దళితులు, మైనార్టీలను భారీ స్థాయిలో బస్సులు, ఇతర వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఇందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నాలుగు మెగా రుణమేళాలకు నాలుగు కోట్లు ఖర్చయ్యాయి. ఎంతో ఆశతో ఆయా సభలకు వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నామమాత్రంగా కొంతమందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. మొదటి రుణ మేళాలో 26,598 మందికి రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రెండో మేళాలో 3,419 మందికి, మూడో మేళాలో 2,965 మందికి, నాలుగో మేళాలో 2,896 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను నాలుగు మేళాల్లో కలిపి 35,878 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నమాట. నాలుగు రుణమేళాల్లో కలిపి నాలుగు లక్షల మందికి సుమారు రూ.2,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం రూ.253.49 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఇచ్చిన వారికన్నా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిందా అంటే అదీ లేదు. బ్యాంకులకు సబ్సిడీని విడుదల చేయడంలో కార్పొరేషన్లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు సగం మందికి కూడా సబ్సిడీలు విడుదల చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. యూనిట్లు అందని వారు, సబ్సిడీ అందని వారు 30 శాతం వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. -
బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ : బంజారాలు, లంబాడీ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ సుప్రీం కోర్టులో శుక్రవారం పిల్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ (సవరణ) చట్టం, 1971 ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని ఎస్టీలుగా గుర్తించటం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది ఆర్టికల్ 342ను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. బంజారాలు, లంబాడీలు, సుగాలీలు ఎస్టీలు కాదని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి ఎస్టీలకు చెందవలసిన ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. లంబాడీలు, సుగాలీలు క్షత్రియ కులానికి చెందిన వ్యాపారులని తెలిపారు. 1976లో తెచ్చిన చట్టం ఎలాంటి విచారణ జరపకుండానే వీరిని ఎస్టీ జాబితాలో చేర్చిందని, అప్పటి వరకు వీరు బీసీ జాబితాలోనే ఉన్నారని వివరించారు. కాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు వాదనలు వినిపించనున్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చిత్రాలు
రచయిత, దర్శకుడు, కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా తెనాలి : షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక, వివిధ ప్రభుత్వ పథకాలపై దళిత, గిరిజనులు అవగాహన కల్పించుకొని ఆయా కార్యక్రమాలతో అభివృద్ధిని సాధించాలనేది తన అభిమతంగా టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వెల్లడించారు. దళిత, గిరిజనులకు సంబంధించిన ఎస్సీ ఉపప్రణాళికలోని వివిధ అంశాలపై తొమ్మిది ప్రచార చిత్రాలను, అన్ని పథకాల్లోని అంశాలు ప్రతిబింబించే విధంగా నృత్యరూపకంతో మరో చిత్రాన్ని ఇటీవలే ఆయన తీశారు. మొత్తం 10 ప్రచార చిత్రాలకు ఆయనే రచన, దర్శకత్వం వహించారు. డబ్బింగ్, మిక్సింగ్ తదితర నిర్మాణానంతర కాక్రమాలను పూర్తిచేసుకుని సెన్సారుకు వెళుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం ఇక్కడి క్యాపిటల్ స్టూడియోలో విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్, సిమెంటురోడ్లు/మంచినీరు, అత్యాచార నిరోధక చట్టం, భూమి కొనుగోలు పథకం, అంటరానితనం, కులాంతర వివాహాలు, నైపుణ్య శిక్షణ పేరుతో గల ఈ చిత్రాల్లో అనుభవజ్ఞులైన సినిమా నటులు అన్నపూర్ణ, వినోద్, నరసింహరాజు, బాలాజీ ఇతర టీవీ నటీనటులే కాకుండా స్థానిక ఔత్సాహిక, వర్ధమాన నటులతో తెనాలి, పరిసరాల్లోనే చిత్రీకరించినట్టు దిలీప్‌రాజా చెప్పారు. చిత్రాల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అన్నిరకాల సాంకేతిక హంగులను చేర్చినట్టు తెలిపారు. సెన్సారు అయిన అనంతరం వీటిని ప్రచారానికి వినియోగించే నిమిత్తం ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వివరించారు. సమావేశంలో నిర్మాత ఆలూరి సుందరరామయ్య, షబ్బీర్ తదితరులు ఉన్నారు. -
ఇది దళితుల వ్యతిరేక ప్రభుత్వం
* దళితుల భూములు లాక్కొని అగ్రవర్ణాలకు కట్టబెడుతోంది.. * ఏఎన్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక ధ్వజం గుంటూరు ఎడ్యుకేషన్: దళితుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం దళితులకు చెందిన భూములను లాక్కుని అగ్రవర్ణాలకు కట్టబెడుతోందని అంటరానితన నిర్మూలన పోరాట సమితి (ఏఎన్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక ఆరోపించారు. దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం జెడ్పీ ప్రాంగణంలో దళితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా చార్వాక మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను అధికారుల అండదండలతో అగ్రకులాలలకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు, గుంటూరు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో 1975లో అప్పటి కలెక్టర్ కత్తి చంద్రయ్య భూమిలేని దళితుల కుటుంబాలకు భూమిని మంజూరు చేయగా, కొర్నెపాడులో చెరువు భూములను అదే గ్రామానికి చెందిన దళితులకు మంజూరు చేశారన్నారు. నడింపాలెంలో దళితులకు ఇచ్చిన భూములను అగ్రకులాలకు దారాదత్తం చేస్తూ రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళితుడు కాండ్రు భాస్కరరావుకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూమిని సైతం అదే ప్రాంతంలోని అగ్రకుల రాజకీయ నాయకులు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారని అన్నారు. దళతులకు న్యాయం చేయాలని జేసీ కృతికా శుక్లాను కోరారు. స్పందించిన జేసీ ఏఎన్‌పీఎస్ ఇచ్చిన ఫిర్యాదును సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ జరిపి, దళితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో సమితి జిల్లా అధ్యక్షుడు టి.ప్రసాదరావు, నరసరావుపేట డివిజన్ కన్వీనర్ చెల్లి కిషోర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటకూర సువర్ణకుమారి, కె.జయరాజు, ఇర్మియా, శ్యామ్‌బాబు, తిక్కరెడ్డిపాలెం బాబు పాల్గొన్నారు. -
దళితబాట సరే..సబ్‌ప్లాన్ ఊసేదిబాబూ
జిల్లాలో సబ్‌ప్లాన్ పనుల్లో తీవ్ర జాప్యం పాలకుల నిర్లక్ష్యమే కారణమంటున్న దళిత నాయకులు సబ్‌ప్లాన్ కే దిక్కులేదు.. దళిత బాట దేనికంటూ ఎద్దేవా..! సమీక్షలు, సమావేశాలు పెట్టని కమిటీలు దేనికంటూ దళితుల ప్రశ్న? భానుగుడి (కాకినాడ) : ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నాయని జిల్లాలో ఎస్సీ,ఎస్టీల ప్రగతిని గమనిస్తే తెలుస్తోంది. దళితుల సామాజిక స్థితిగతులను మార్చే దిశగా ఉన్నత లక్ష్యంతో 2013లో ప్రవేశ«పెట్టిన సబ్‌ప్లాన్ నిధులు సైతం తాజాగా ఆ కోవలోకి చేరాయి. శాఖల వారీగా కేటాయింపులు జరిగినా పనుల నిర్వహణ ’ఎక్కడి గొంగళి అక్కడే’ అన్న చందంగా చతికిలపడింది. అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక బృహత్తర ప్రణాళిక పేద ప్రజలకు చేరడం లేదు. లోపాలను సరిదిద్దకుండా దళితబాట కార్యక్రమాలేమిటని దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ సబ్‌ప్లాన్ . దళితులకోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను దామాషా ప్రాతిపదికన వారి ప్రగతికే ఖర్చు చేయాలన్న నిబంధనతో ప్రత్యేక అభివృద్థి కమిటీల ఏర్పాటుతో 2013లో ఈ సబ్‌ప్లాన్ రూపుదిద్దుకుంది. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీల ప్రగతికి 17.01 శాతం, ఎస్టీలకు 5.53 శాతం నిధులను కేటాయిస్తున్నారు. ఈ నిధులను సబ్‌ప్లా¯ŒSలో భాగంగా మంత్రులు, ప్రిన్సిపల్ కార్యదర్శి, శాఖల ముఖ్య అధికారులు సభ్యులుగా ఉన్న నోడల్ ఏజెన్సీలు, హైలెవల్ వర్కింగ్ కమిటీ, రాష్ట్ర కౌన్సిల్లు శాఖల వారీగా ప్రత్యేక ప్రణాళికల ఆధారంగా కేటాయిస్తారు. సబ్‌ప్లాన్ యాక్ట్ ప్రకారం ఈ కమిటీలు ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి ప్రగతిపై చర్చ జరపాలి. తొలినాళ్ళలో సమావేశం నిర్వహించి తర్వాత చేతులు దులుపుకున్నారు. ఇప్పటికి ఒకే ఒక్కసారి మినహా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేకపోవడం దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుధ్ధి అవగతం అవుతోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ..! ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం భారీ బడ్జెట్లు ప్రవేశపెట్టి అరకొర నిధులు వెదజల్లి అయిందనిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 2016–17 సంవత్సరానికిగాను రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధుల రూపంలో రూ.8856 కోట్లు ఎస్సీల అభివృధ్దికి, 3099 కోట్లు ఎస్టీల అభివృధ్దికి కేటాయించారు. కేటాయింపులు జరిగాయి గానీ శాఖల వారీగా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకులకు చిత్తశుద్ధి లేమి కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని దళితులు వాపోతున్నారు. రహదారుల సంగతేంటి? దళితులు 40 శాతంకంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్‌శాఖలో 140 పనులను గుర్తించారు. వీటికి జిల్లాలో రూ.40 కోట్లు కేటాయించారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ కింద 19 పనులు గుర్తించగా 19.26 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లోనూ ఎటువంటి పురోగతీ లేదు. స్త్రీనిధి.. టీడీపీ వారికి మాత్రమే..! గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళిత మహిళల ప్రగతికి స్త్రీనిధిని ప్రభుత్వం అందిస్తోంది. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకుల కారణంగా అసలైన లబ్థిదారులకు ఈ నిధులు అందడం లేదు. దీనికి సబ్‌ప్లా¯ŒS నిధుల రూపంలో రూ.14 కోట్లు విడుదలయ్యాయి. 31 మండలాల్లో 3622 మంది మహిళలకు రూ.14కోట్లు మంజూరు చేశారు. వీటిని సగం మందికి కూడా ఇంకా అందివ్వ లేదు. టీడీపీలోని పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఈ ఫలాలు అందుతున్నాయని, సామాన్యులకు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచారం లోటు.. సబ్‌ప్లాన్ నిధుల్లో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ నిమిత్తం జిల్లాకు వెయ్యి సీట్లు కేటాయించగా ఇందులో ఎస్సీలకు 700, ఎస్టీలకు 300. దీనికి నెలకు ప్రతి విద్యార్థికి 8 వేలు ఉపకారవేతనం అందిస్తారు. జిల్లాలో ఈ పథకం ప్రచార లేమి కారణంగా కేవలం 24 మంది ఎస్సీ విద్యార్థులు, ఏడుగురు ఎస్టీ విద్యార్థులు మాత్రమే ఎంపికవడం విచారకరం. ఎస్సీ రుణాల గ్రౌండింగ్ ఎప్పటికి పూర్తయ్యేనో.... షెడ్యూల్డ్ కులాల అభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచార ఆర్భాటానికే తప్ప క్షేత్ర స్థాయిలో చంద్రన్న సంక్షేమం కానరావడం లేదు. షెడ్యూల్డ్ కులాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాల ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. 2015–16 ఆర్థిక సంవత్సర లబ్థిదారుల రుణాల గ్రౌండింగ్ నేటికీ వందల సంఖ్యలోనే ఉంది. సబ్సిడీ రుణం మంజూరు చేసినప్పటికీ వాటికోసం సంవత్సర కాలంగా లబ్థిదారులు ఎస్సీ కార్పొరేషన్, బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఫలితం లేని దుస్థితి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016–17)కు అర్ధ సంవత్సరం దాటినా లబ్థిదారుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణలోనే ఉన్నారు. జిల్లాలో 2015–16 సంవత్సరానికి రూపొందించిన రుణ ప్రణాళిక ప్రకారం స్వయం ఉపాధి పథకాలకు ఆర్ధిక సహాయం అమలు చేసేందుకు రూ.112.11 కోట్లతో 8,473 మందికి లబ్థి చేకూర్చేందుకు లక్ష్యాన్ని నిరే్ధశించారు. దీనిలో బ్యాంక్ లింకేజీ పరంగా 2,594 మంది లబ్థిదారులకు రూ.3644.86 లక్షలు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. కాని కేవలం 127 మంది లబ్థిదారులకే ఇప్పటి వరకు రుణాల గ్రౌండింగ్ పూర్తయింది. అలాగే బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేసే ఎన్ఎస్ఎఫ్డీసీ స్కీంలో రూ.566.14 లక్షలతో 316 మంది లబ్థిదారులకుగాను రూ.198.25 లక్ష్యలతో 90 మందికి, ఎన్ఎస్కెఎఫ్డీసీ స్కీంలో రూ.166.35 లక్షలతో 109 మందికిగాను రూ.29.50 లక్షలతో 90 మందికి రుణ మంజూరు అయితే చేశారు కానీ నేటికీ ఒక్క పైసాకూడా లబ్థిదారులకు ఇవ్వలేదు. సబ్‌ప్లాన్ ఊసేదీ : సబ్ ప్లాన్ కమిటీ సభ్యులు రెండు నెలలకోసారి సమావేశం కావాలి. 2013లో ఈ కమిటీ ఏర్పడింది. ఆదిలో ఓసారి సమావేశమయ్యారు. తరువాత ఆ ఊసే లేదు. నిధులు సరే, అమలేదీ : 2016–17 సంవత్సరానికిగాను రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధులు రూ.8,856 కోట్లు ఎస్సీల అభివృద్ధికి, రూ.3,099 కోట్లు ఎస్టీల అభివృద్ధికి కేటాయించారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీలున్నా ఈ నిధుల వ్యయం అంతంతమాత్రమే. అతీగతీలేని భవనాలు : మంజూరైన 76 సామాజిక భవనాల్లో 56 మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో 30కి పైగా వివిధ దశల్లో నిలిచి పోయాయి. రహదారుల సంగతేంటి? : గిరిజన ప్రాంతాల్లో 19 రహదారి పనులను సబ్ ప్లా¯ŒS కింద గుర్తించి రూ.19.26 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లోనూ ఎటువంటి పురోగతీ లేదు. శ్మశాన వాటికల మాటేమిటి! సబ్‌ప్లాన్ లో భాగంగా జీవో నంబరు 715,1235 ప్రకారం జిల్లాలో దళితులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో వీటికోసం ప్రత్యేకంగా దరఖాస్తులు సమర్పించినా ఎటువంటి పరిష్కారమూ చూపించలేదు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద విదేశాల్లో పీజీ చదివే విద్యార్థులకు రూ.15 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఏడాది 500 మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నా ఈ ఏడాది కేవలం ఏడుగురు మాత్రమే విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్ళారంటే ఈ పథకం తీరు అర్ధం చేసుకోవచ్చు. అతిగతీలేని సామాజిక భవనాలు... సబ్‌ప్లాన్ నిధుల కింద ఈ ఏడాది 76 సామాజిక భవనాలు జిల్లాకు మంజూరయ్యాయి. ఇందులో 56 భవనాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో వివిధ దశల్లో నిలిచిపోయిన భవనాలు 30కి పైగా ఉన్నాయి. ప్రారంభమై ఏళ్ళు గడుస్తున్నా అర్థంతరంగానే ఉన్నాయి . వీటికోసం వెచ్చించిన రూ.5 కోట్ల 70 లక్షల సబ్‌ప్లాన్ నిధులు కేవలం ఫౌండేషన్లకే పరిమితమయ్యాయి. 50 యూనిట్ల ఉచితం విషయం తెలియదు దళితులకు 50 యూనిట్లులోపు కరెంటు ఉన్న ఇళ్ళకు ఏపీఈపీడీసీఎల్ ఉచిత విద్యుత్ ఇస్తుంది.ఈ వెసులుబాటు ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. దీంతో ఎవరూ దీన్ని వినియోగించుకోవడం లేదు. – ఐ.సుభాష్, దళిత సామాజిక కార్యకర్త ప్రతి పాదనలు పంపించాం దళిత గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కోసం రూ.53 కోట్లు ప్రతిపాదనలు జిల్లాలో సిద్ధం చేశారు. వీటిని నోడల్ ఏజేన్సీకి పంపారు. ఆర్అండ్బి ద్వారా జిల్లాలో రూ.92 కోట్లు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఎక్కువగా ట్రైబల్ ఏరియాలో రహదారుల పనులే ఎక్కువ. ఈ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం. – ఎన్ స్టాలిన్ బాబు, జిల్లా మానిటరింగ్ నాన్ అఫీషియల్ కమిటీ సభ్యులు -
ఎస్సీ ఎస్టీలకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ
అనంతపురం రూరల్: ఏపీ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ విన్సెంట్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైట్ మోటర్ వెహికల్‌కు 19సంవత్సరాలు నిండి 8వ తరగతి పాసై ఉండాలి. హెవి మోటర్ వెహికల్‌కు 10వ తరగతి పాసై ఉండి.. 20 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు డ్రైవింగ్ శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులుWWW.jobsmela.apssdc.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. -
గోరక్షక్ గుండాలపై అట్రాసిటీ కేసులు పెట్టాలి
బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు బాపట్ల (మూలపాలెం): దళితుల పట్ల అధికార తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బహుజన కెరటాల వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు విమర్శించారు. గోరక్షక్ గుండాల చేతులో దాడికి గురై అమలాపురంలో చికిత్సపొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ దళితులపై దాడి జరిగి 10 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ముఖ్యమంత్రికానీ, దళిత ఎంపీలు, ఎమ్మెల్యే ఇంతవరకు బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. అమలాపురంలో గుజరాత్ తరహా దాడులు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణం అన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు బహుజనులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. బాధితులను పరామర్శించిన వారిలో బహుజన రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ జి. శ్రీనివాస్, డాక్టర్ కాకాని సుధాకర్, డాక్టర్ జి.ఎం. సాంబయ్య, గల్లా ప్రకాష్‌రాజ్, మూర్తిలు ఉన్నారు. -
దళితులపై దాడి హేయం
డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి కనకరాజుప్రసాద్ కొరిటెపాడు: దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) జిల్లా కార్యదర్శి కనకరాజుప్రసాద్ హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ స్థానిక లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ఉనా గ్రామంలో జరిగిన దాడి మరువకముందే ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో దళితులపై దాడులు జరిగాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా దళితులపై దాడులు చేయటం హేయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడులు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యక్ష పోరాటలకు సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ నాయకులు టి.గోవింద్, సంగాల సంగీతరావు, పున్నయ్య, మందా రమేష్, చలసాని సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడికి నిరసన
కొరిటెపాడు (గుంటూరు): తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాదిగలపై మతోన్మాదుల దాడులకు నిరసనగా నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ చేపట్టారు. లాడ్జి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ శంకర్‌విలాస్ సెంటర్, ఏసీ కళాశాల మీదుగా మార్కెట్ సెంటర్ వరకు కొనసాగింది. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ.. అమలాపురంలో విద్యుత్ షాక్‌తో చనిపోయిన ఆవు చర్మాన్ని దళిత మాదిగలు తీస్తుండగా కొంతమంది హిందూ మత ఉన్మాదులు విచక్షణా రహితంగా స్తంభానికి కట్టేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశువుల నుంచి చర్మాన్ని వలిచి సమాజం మొత్తానికి పాదరక్షకులు అయిన చెప్పులు అందిస్తూ మాదిగ జాతి సమాజానికి సేవలు అందిస్తుందని తెలిపారు. చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న నెపంతో మోకాటి ఎలీషా, మోకాటి మోజస్, మోకాటి వెంకటేశ్వర్లులపై దాడి చేయటం దుర్మార్గమన్నారు. ఈ దాడి మాదిగజాతి సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. దాడికి పాల్పడ్డవారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు నమోదు చేసి, తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మల్లవరపు రవిరాజామాదిగ, వట్టెపు చిన్నామాదిగ, జి.గురవయ్యమాదిగ, కట్టా బాబు, పి.మంగయ్యమాదిగ, బొమ్మా డేవిడ్‌మాదిగ, ఆర్.ఇస్రాయేలు, వినుకొండ బాబు, కె.సాల్మన్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై మూకుమ్మడి దాడులు
రియల్టరుగా మారిన చంద్రబాబు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ తెనాలి : దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆరోపించారు. జూలై 17 (కారంచేడు) నుంచి ఆగస్టు 6 (చుండూరు వరకు) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ముగింపు సభ శనివారం ఇక్కడి ఎన్జీవో కల్యాణమండపంలో నిర్వహించారు. దళితులపై కులపరమైన దాడులు, ముస్లింలు, క్రై స్తవులపై మతపరమైన దాడులు, జనాభాలో 55 శాతంగా వున్న బీసీలపై ఆర్థికపరమైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 15 లక్షల భూబ్యాంకు ఏర్పాటు చేశామంటూ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, పీడిత కులాల భూముల్ని లాక్కోవటమే కాకుండా లక్షలాది తీరప్రాంత ప్రజలను నిరాశ్రయుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నిరుపేదల్ని నిరాశ్రయుల్ని చేసే పనిలో ఉన్నారన్నారు. రియల్టర్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ద్వారా అడ్డుకొంటామని హెచ్చరించారు. -
దళితులపై ఉమ్మడి దాడులు
రియల్టరుగా మారిన చంద్రబాబు కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ తెనాలి : దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆరోపించారు. జూలై 17 (కారంచేడు) నుంచి ఆగస్టు 6 (చుండూరు వరకు) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ముగింపు సభ శనివారం ఇక్కడి ఎన్జీవో కల్యాణమండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దళితులపై కులపరమైన దాడులు, ముస్లింలు, క్రైస్తవులపై మతపరమైన దాడులు, జనాభాలో 55 శాతంగా వున్న బీసీలపై ఆర్థికపరమైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 15 లక్షల భూబ్యాంకు ఏర్పాటు చేశామంటూ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, పీడిత కులాల భూముల్ని లాక్కోవటమే కాకుండా లక్షలాది తీరప్రాంత ప్రజలను నిరాశ్రయుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నిరుపేదల్ని నిరాశ్రయుల్ని చేసే పనిలో ఉన్నారన్నారు. రియల్టర్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ద్వారా అడ్డుకొంటామని హెచ్చరించారు. -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి!
మఠంపల్లి : మోడల్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి.. మీరు బీసీలు, ఎస్టీలు కాబట్టి... మీకు దరఖాస్తు రుసుం కూడా ఉండదన్నారు... విద్యార్థులందరి దగ్గరి నుంచి దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలన్నీ తీసుకున్నారు... మేం దరఖాస్తు చేసేశాం.. మీరు వెళ్లి పరీక్ష రాయొచ్చని చెప్పారు... తీరా చూస్తే ఆ పరీక్ష రేపు అనగా ఇప్పుడు హాల్‌టికెట్లు రాలేదు... మీ ధ్రువపత్రాలు అప్లోడ్ కాదని చెప్పి చేతులు దులుపుకోవడంతో జిల్లాలోని మఠంపల్లి మండలానికి చెందిన 15 మంది విద్యార్థులు పాలీసెట్ - 2016 రాసే అర్హత కోల్పోయూరు. విద్యార్థులు చదువుకుంటున్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు, తనకు పరిచయస్తుడైన కోదాడలోని ఓ కళాశాల ప్రతినిధి ఇద్దరూ కలిసి చేసిన నిర్వాకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనస్తాపానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మఠంపల్లిలోని మోడల్‌స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో ఈ ఏడాది 69 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యనభ్యసించారు. పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ సలహాతో సుమారు 15 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తు చేసుకునే వారు బీసీ, ఎస్టీలు కాబట్టి దరఖాస్తు రుసుం లేకుండానే అప్లయ్ చేస్తామని... సీట్లు వస్తే మా కళాశాలలోనే తక్కువ ఫీజుకు పాలిటెక్నిక్‌లో చేర్చుకుంటామని చెప్పి ఈ దరఖాస్తులను జాకీర్‌హుస్సేన్‌కు పరిచయస్తుడైన కోదాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి కె.శ్రీనివాస్‌కు అందజేశారు. దీంతో దరఖాస్తులు చేసుకున్నాం కదా... అని రేయింబవళ్లు చదివి విద్యార్థులు పరీక్షకు సంసిద్ధులయ్యారు. ఈలోగా ఈనెల 21న పాలిటెక్నిక్ అర్హత పరీక్ష జరగనుండటంతో హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్లో ప్రయత్నించారు. అయితే మో డల్ స్కూల్ నుంచి దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క విద్యార్థికి కూడా హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాకపోవడంతో ఆందోళన చెంది ఉపాధ్యాయుడిని సంప్రదించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి శ్రీనివాస్‌ను సంప్రదించగా మోడల్ స్కూల్ విద్యార్థుల దరఖాస్తులు అప్లోడ్ కాలేదని అందుకే నెట్లో హాల్ టికెట్లు లేవని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ప్రమేయం లేదు ఈ విషయమై మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ బూర సైదయ్యగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, మోడల్ స్కూల్ నుంచి అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు ఇవ్వలేదన్నారు. వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని, ఇందులో తన ప్రమేయం లేదని చెప్పారు. ఉపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ వివరణ.. కోదాడలోని కళాశాల ప్రతినిధి కుర్రె శ్రీనివాస్ ఎలాంటి ఫీజులేకుండా ఆన్లైన్లో పాలిసెట్‌కు దరఖాస్తు చేస్తానని చెప్పడంతో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించిన మాట వాస్తవమేనని తెలుగు ఉపాధ్యాయుడు జాకీర్ హుస్సేన్ చెప్పారు. అయితే, విద్యార్థులు నేరుగా కళాశాల ప్రతినిధికే దరఖాస్తులు ఇచ్చారని, వారు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా సాంకేతిక కారణాలతో అప్లోడ్ కాలేదని చెపుతున్నారని చెప్పారు. విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు... విద్యార్థుల భవిష్యత్‌తోచెలగాటం ఆడొద్దు. టెన్త్ పూర్తయిన నా కుమార్తెను పాలిటెక్నిక్ చేయించాకున్నా. పరీక్ష తేదీ దగ్గర పడినా హాల్‌టికెట్లు రాలేదు. దరఖాస్తులు చేరలేదనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. - సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, అల్లీపురం -
‘పూనా’లోనే జరిగింది ద్రోహం
గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షతో అంబేడ్కర్ తదితరులకు ఇష్టంలేకున్నా సరిగ్గా 83 ఏళ్ల క్రితం పూనా ఒప్పందం జరిగింది. దాని ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయ అధికార భాగస్వామ్యం అందలేదు. రాజకీయ రిజర్వేషన్లు పాక్షిక ప్రయోజనాన్నే అందించాయి. సవర్ణ హిందువులు లేదా దళితేతరులు తమకు అనుకూలమైన దళితులే ఎన్నికయ్యేలా చేస్తున్నారు. అవీ లేకుండా చేయాలని జరిగిన కుట్రలను అంబేడ్కర్ ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కాయి. లేకుంటే ఆ అవకాశమూ దక్కేది కాదు. శతాబ్దాలుగా అణచివేతకు, తరతరాలుగా వెలివేతకు గురవుతున్న వర్గాలకు విముక్తిని కలిగించడంలో రాజకీయాధికారం కీలకపాత్ర వహిస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ భావించారు. రాజ్యాంగపరంగా అది అక్షరాలా అమలు జరిగేలా చూసేందుకు అహరహం తపించారు. కానీ అంబే డ్కర్ తన ఆలోచనలకు ఆచరణ రూపాన్నిచ్చే ప్రతి సందర్భంలోనూ కొందరు మోకాలడ్డారు. ఆయన ఆశించినది ఆశించినట్టు జరగకుండా, అణగారిన వర్గాలకు ఫలితాలను అందకుండా చేయడంలో కొంత మేరకు కృతకృత్యుల య్యారు. 83 ఏళ్ళ క్రితం 1932 సెప్టెంబర్ 24న, సరిగ్గా ఇదే రోజున ‘పూనా ఒడంబడిక’ పేరిట దళితులకు ద్రోహం జరిగింది. ఇది రెండు విభిన్న సామా జికవర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. అంబేడ్కర్, గాంధీలు ప్రత్యర్థులుగా నిలిచి పూనాలో కుదుర్చుకున్న ఆ ఒప్పందం దుష్ర్ఫభావం ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయాధికార భాగస్వామ్యం అందలేదు. అంబేడ్కర్, గాంధీల సంఘర్షణ అంబేడ్కర్ 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రావాలనీ, ప్రభుత్వాలలో వారికి సరైన ప్రాతినిధ్యం ఉండాలనీ వాదిస్తూ వచ్చారు. 1927లో సైమన్ కమిషన్ ముందు కూడా ఆయన తన వాదనలను వినిపించారు. 1930-32 మధ్య లండన్‌లో జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై గట్టిగా వాదించారు. మొదటి సమా వేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మహా త్మాగాంధీ కాంగ్రెస్ తరఫున నిలిచి... అంటరాని కులాల రాజకీయ హక్కుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేడ్కర్, గాంధీల మధ్య ఈ విష యమై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారనీ, హిందువులలో భాగంగా వీరిని ఏనాడూ చూడలేదనీ, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారనీ అంబేడ్కర్ వాదించారు. ఆ కారణం గానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలనీ కోరారు. లేకుంటే రాజకీయ స్వేచ్ఛకు బదులు వారు తరతరాల బానిసత్వానికి బలికావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అంటరాని వారు హిందువులేనని, వారికి ప్రత్యేక ఓటింగ్ హక్కులు, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే ఏర్పాట్లు అవసరం లేదని గాంధీ గట్టిగా అడ్డుతగిలారు. రెండు వాదనలనూ విన్న బ్రిటిష్ ప్రభుత్వం అంబేడ్కర్ సూచించినట్టు అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కుకు, తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశానికి అంగీకరించింది. దానిని తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ 1932 మార్చి 11న ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తూ ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కులు కల్పిస్తే నేను ఆమ రణ నిరాహారదీక్ష చేయగలనని తెలియజేస్తున్నాను’’ అని హెచ్చరించారు. ఇదే అంశంపై నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో రామ్సే మెక్‌డొనాల్డ్ ‘‘మీ ఉద్దేశం హిందువులకూ, అంటరాని కులాలకూ కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐకమత్యం సంరక్షించుకోవాలని కూడా కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా చేయుటకే మీరు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోక తప్పడం లేదు’’ అని అన్నారు. ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ ఇవ్వడం కూడా వారిని రక్షించదు’’ అంటూ గాంధీ తన పాత ధోరణిలోనే ఆయనకు సమాధానం ఇచ్చారు. ‘నిరాహారదీక్ష’ కుతంత్రం ఆ సందర్భంగా అంబేడ్కర్ ‘‘స్వతంత్ర రాజ్యాంగంలో మెజారిటీగా ఉన్న హిందువుల నిరంకుశత్వం నుంచి తమను తాము రక్షించుకోవడానికి రాజ కీయ హక్కులను సాధించుకోవాల్సిన వర్గం ఏదైనా ఉందంటే అది అంట రాని, అణగారిన ప్రజానీకమేననేది వాస్తవం. ఏ మతానికైతే వారు బందీ లుగా ఉన్నారో ఆ మతం వారికి ఒక గౌరవ స్థానాన్ని కల్పించడానికి బదులు కుష్ఠు రోగులకన్నా హీనంగా చూస్తున్నది. దళితులను ఆర్థికంగా మరింత పరా ధీనులను చేస్తున్నది. ఎవరైనా చైతన్యవంతులై తల ఎత్తి నిలబడితే అందరూ కలసి దాడులు చేస్తున్నారు’’ అంటూ గాంధీ లాంటి వారికి దీటైన జవా బిచ్చారు. దళితుల పక్షాన అంబేడ్కర్, సవర్ణ హిందువుల పక్షాన గాంధీ తల పడిన సందర్భమిది. చర్చకు వచ్చిన అన్ని ప్రశ్నలకూ అంబేడ్కర్ దీటుగా సమాధానం ఇచ్చారు. అంటరాని కులాల ప్రత్యేక ఓటింగ్ హక్కును అడ్డు కోవడానికి గాంధీ ఉపవాస దీక్ష పూని, ప్రాణాలు తీసుకుంటానని భయ పెట్టారు. దీంతో అంబేడ్కర్, ఇతర అంటరాని కులాల నాయకులు వారికి ఇష్టం లేని విధానానికి ఆమోదం పలికేలా చేసి, ఒప్పందంపై సంతకాలు చేయించుకున్నారు. ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే, తనకు ప్రాణహాని జరిగితే, మైనారిటీలుగా ఉన్న అంటరాని కులాలపై ప్రతి గ్రామంలో దాడులు జరుగుతాయని కూడా గాంధీజీ పరోక్షంగా హెచ్చరించారు. అందువల్ల ఈ ఒప్పందానికి గాంధీ చేసిన కుట్రే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ఈ ఒప్పందంలో తొమ్మిది అంశాలున్నాయి. ప్రత్యేక ఓటింగ్ పద్ధతికి బదులుగా నేటి రిజర్వుడు స్థానాల విధానానికి అంగీకారం ఈ ఒప్పందంలో కీలక అంశం. నాడే దళితుల నుంచి స్వతంత్ర రాజకీయ నాయకులు ఎదిగే ప్రక్రియకు గండి పడింది. 1937, 1942 సాధారణ ఎన్నికల్లో అదే రుజువైంది. కేవలం కాంగ్రెస్ అనుచరులు మాత్రమే రిజర్వుడు స్థానాల నుంచి ఎన్ని కయ్యారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారారే తప్ప అంటరాని కులాల ప్రతినిధులుగా నిలవలేకపోయారు. రాజ్యాంగ సభలోనే రిజర్వేషన్ల వ్యతిరేక కుట్ర అంబేడ్కర్ అంతటితో ప్రత్యేక ఓటింగ్ హక్కు డిమాండ్‌ను వదిలిపెట్టలేదు. 1946లో రాజ్యాంగ సభకు అందించిన ‘రాష్ట్రాలు-మైనార్టీలు’ అనే వినతి పత్రంలో అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కును కోరారు. కానీ, రిజర్వేషన్లను, అణగారిన వర్గాల హక్కులను అంగీకరించలేని సవర్ణ హిందువులు మరొక కుట్రకు తెరతీశారు. రాజ్యాంగ రచన సభలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రూపంలో అడ్డుపడ్డారు. రాజ్యాంగ సభ పటేల్ నేతృ త్వంలో మైనార్టీల సమస్యలపై వేసిన ఉపసంఘం తన నివేదికలో అన్నిరకాల రిజర్వేషన్లనూ రద్దు చేయాలని సిఫారసు చేసింది. ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మౌనం దాల్చి, అణగారిన వర్గాల హక్కులు పట్టనట్టు వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో ఆ సమయంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్ ప్రత్య క్షంగా రంగంలోకి దిగక తప్పలేదు. ‘‘ఈ రాజ్యాంగ రచన ద్వారా షెడ్యూల్డ్ కులాలకు కొన్ని రక్షణలు లభిస్తాయని భావించాను. అంటరాని కులాలకు మీరు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే నేను రాజ్యాంగ సభలో సభ్యు నిగా కొనసాగాల్సిన అవసరం లేదు. నేను బయటకు వెళ్ళిపోతాను. అంట రాని కులాల సంక్షేమాన్ని సవర్ణ హిందువులు కుట్రపూరితంగా అడ్డుకున్నారని చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ఆయన హెచ్చరించారు. దీంతో పటేల్ వంటి వారు దిగిరాక తప్పలేదు. చివరకు 1949 మే 25, 26 తేదీల్లో రాజ్యాంగ సభ షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లను కొనసాగించాలని తీర్మానించింది. ఆత్మావలోకనం అవసరం అయితే, రాజకీయ రిజర్వేషన్లు ఒక పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే అం దించాయి. 80 శాతంగా ఉన్న సవర్ణ హిందువులు లేదా దళితేతరులు నిజ మైన దళిత ప్రతినిధులనుగాక, తమకు అనుకూలమైన రాజకీయ నాయకులకే ఎన్నికయ్యే అవకాశం కల్పిస్తున్నారు. అంబేడ్కర్ ప్రతిపాదించినట్టుగా ప్రత్యేక ఓటింగ్ పద్ధతి ద్వారా తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధా నం అమలు జరిగి ఉంటే నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వార నడంలో ఎటువంటి సందేహం లేదు. అంబేడ్కర్ పటేల్ నేతృత్వంలో సవర్ణ హిందువుల కుట్రలను గట్టిగా ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వే షన్లు దక్కాయి. లేకుంటే దళితులకు ఆ అవకాశమూ దక్కకుండా పోయేది. పూనా ఒడంబడిక ద్వారా దళితుల రాజకీయ స్వాతంత్య్రానికి జరగ రాని నష్టం జరిగిపోయింది. దళిత ప్రజాప్రతినిధులు నిజమైన రాజకీయ నిర్ణే తలుగా దళితుల పక్షాన నిలవడానికి అడ్డుపడుతున్న అంశాలను సమీక్షించు కోవాలి. చివరిగా ఒకమాట. రాజకీయ రిజ ర్వేషన్లవల్ల కలిగే ప్రయోజనాలు పరిమితమైనవే. అయినా అవి అంబేడ్కర్ తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి సాధించినవి. ఆ హక్కును అనుభవిస్తున్న దళిత ప్రజాప్రతినిధులు, రాజకీయవేత్తలు ఈ రోజుకైనా ఆత్మావలోకనం చేసుకోక తప్పదు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
బాబు కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు మొండిచేయి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 19 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అయితే చంద్రబాబు కేబినెట్లో ఎస్టీలు, మైనార్టీ వర్గాల నుంచి ఎవరికీ చోటు లభించలేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కూడా కేబినెట్లో బెర్తు దక్కలేదు. ఈ జిల్లా నుంచి టీడీపీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచింది. కాగా బాబు కేబినెట్లో కమ్మ, కాపులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.