చిన్నారికి అండగా సింగపూర్‌ వాసులు | Singapore telugu samjam helps cancer patient Varenya | Sakshi
Sakshi News home page

చిన్నారికి అండగా సింగపూర్‌ వాసులు

Published Sat, Jun 15 2019 2:08 PM | Last Updated on Sat, Jun 15 2019 5:39 PM

Singapore telugu samjam helps cancer patient Varenya - Sakshi

అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వరెణ్య(6)కు సహాయం అందించడానికి సింగపూర్‌ వాసులు ముందుకొచ్చారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం పిప్రీకి చెందిన దుర్గి నరేందర్‌ గౌడ్ కుమార్తె వరెణ్య తీవ్రమైన మైలాయిడ్‌ లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. అత్యవసరంగా కీమోథెరపీ చేపించాలని డాక్టర్లు సూచించారు. దీంతో తమ చిన్నారిని కాపాడాలని పేదవారైన ఆ తల్లిదండ్రులు తమగోడు వెళ్లబోసుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సింగపూర్‌ తెలుగుసమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి చొరవతో విరాళాలు ఇవ్వడానికి గ్రూపు సభ్యులు ముందుకొచ్చారు. మూడు లక్షల రూపాయలను చిన్నారి తండ్రికి విరాళంగా అందించారు. విరాళాలు అందించిన వారందరికి వరెణ్య తండ్రి నరేందర్‌ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే వరెణ్య చికిత్సకు మరింత డబ్బు అవసరం అవ్వడంతో ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయగలిగితే దయచేసి కింద పేర్కొన్న అకౌంట్‌కి పంపించాలని కోరారు.


వరెణ్య తండ్రి దుర్గి నరేందర్‌ గౌడ్ బ్యాంక్‌ అకౌంట్‌:

D Narendhar Goud
A / C  NO :  621 681 75707
IFSC NO : SBIN 0020374
SBI BHEEMGAL

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement