pipri village
-
చిన్నారికి అండగా సింగపూర్ వాసులు
అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వరెణ్య(6)కు సహాయం అందించడానికి సింగపూర్ వాసులు ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పిప్రీకి చెందిన దుర్గి నరేందర్ గౌడ్ కుమార్తె వరెణ్య తీవ్రమైన మైలాయిడ్ లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. అత్యవసరంగా కీమోథెరపీ చేపించాలని డాక్టర్లు సూచించారు. దీంతో తమ చిన్నారిని కాపాడాలని పేదవారైన ఆ తల్లిదండ్రులు తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ తెలుగుసమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి చొరవతో విరాళాలు ఇవ్వడానికి గ్రూపు సభ్యులు ముందుకొచ్చారు. మూడు లక్షల రూపాయలను చిన్నారి తండ్రికి విరాళంగా అందించారు. విరాళాలు అందించిన వారందరికి వరెణ్య తండ్రి నరేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే వరెణ్య చికిత్సకు మరింత డబ్బు అవసరం అవ్వడంతో ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయగలిగితే దయచేసి కింద పేర్కొన్న అకౌంట్‌కి పంపించాలని కోరారు. వరెణ్య తండ్రి దుర్గి నరేందర్ గౌడ్ బ్యాంక్ అకౌంట్: D Narendhar Goud A / C NO : 621 681 75707 IFSC NO : SBIN 0020374 SBI BHEEMGAL -
2 ఓట్లతో గెలుపు.. లాటరీలో అనూహ్య ఫలితం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూరు మండలం పిప్రిలో ఓట్ల లెక్కింపులో వింత పరిస్థితి నెలకొంది. తొలుత ఓ అభ్యర్థి గెలవగా.. రీ కౌంటింగ్‌లో పరిస్థితులు మారిపోయాయి. చివరకు విజేత ఎవరో తెలుసుకోవడానికి లాటరీ తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తొలుత పిప్రికి సంబంధించి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. ఈ సారి అధికారులు ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు(690) వచ్చాయి. దీంతో విజేత ఎవరో తెలుసుకోవడానికి అధికారులు లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. దీంతో అధికారులు బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను గెలిచినట్టు ప్రకటించారు. -
పిప్రిలో వైద్యశిబిరం
బజార్హత్నూర్ : మండలంలోని పిప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో రాపీడ్ ఫీవర్ సర్వేలో భాగంగా సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో 72మందికి, ప్రాథమికోన్నత పాఠశాలలో 19 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో కైలాస్, సూపర్వైజర్లు దేవిదాస్, సుశీల, హెల్త్‌అసిస్టెంట్ గాజుల రమేశ్, ఏఎన్ఎం తారసీనా, ఆశ కార్యకర్త లలిత పాల్గొన్నారు.