
సింగపూర్ : మే డే సందర్భంగా కార్మిక సోదరులకు సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్) బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటికే బీమా కంపెనీ ప్రతినిధులతో చర్చించామని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి తెలిపారు. మేడే సందర్భాన్ని పురస్కరించుకుని వీడియో కాల్ ద్వారా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యంగా ఉండాలని , ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించి, జాగ్రత్తతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాక్షించారు. కరోనా అదుపులోకి వచ్చి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కార్మికుల నివాసాల్ని సందర్శించాలని కమిటీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment