
మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్(పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : బంజారాలు, లంబాడీ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ సుప్రీం కోర్టులో శుక్రవారం పిల్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ (సవరణ) చట్టం, 1971 ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని ఎస్టీలుగా గుర్తించటం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది ఆర్టికల్ 342ను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. బంజారాలు, లంబాడీలు, సుగాలీలు ఎస్టీలు కాదని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి ఎస్టీలకు చెందవలసిన ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. లంబాడీలు, సుగాలీలు క్షత్రియ కులానికి చెందిన వ్యాపారులని తెలిపారు. 1976లో తెచ్చిన చట్టం ఎలాంటి విచారణ జరపకుండానే వీరిని ఎస్టీ జాబితాలో చేర్చిందని, అప్పటి వరకు వీరు బీసీ జాబితాలోనే ఉన్నారని వివరించారు. కాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు వాదనలు వినిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment