banjaralu
-
బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ : బంజారాలు, లంబాడీ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ సుప్రీం కోర్టులో శుక్రవారం పిల్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ (సవరణ) చట్టం, 1971 ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని ఎస్టీలుగా గుర్తించటం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది ఆర్టికల్ 342ను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. బంజారాలు, లంబాడీలు, సుగాలీలు ఎస్టీలు కాదని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి ఎస్టీలకు చెందవలసిన ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. లంబాడీలు, సుగాలీలు క్షత్రియ కులానికి చెందిన వ్యాపారులని తెలిపారు. 1976లో తెచ్చిన చట్టం ఎలాంటి విచారణ జరపకుండానే వీరిని ఎస్టీ జాబితాలో చేర్చిందని, అప్పటి వరకు వీరు బీసీ జాబితాలోనే ఉన్నారని వివరించారు. కాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు వాదనలు వినిపించనున్నారు. -
తీజ్ ఉత్సవాలు
నిజామాబాద్ కల్చరల్ : బంజారాల సంప్రదాయ పండుగ తీజ్ శనివారం నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇందుకు వేదికైంది. బంజారా తీజ్ ఉత్సవం–2016 పేరుతో తీజ్ ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 300 మంది మహిళలు, యువతులు వెదురుబుట్టలలో గోధుమ విత్తనాలు నాటి, ప్రత్యేక పూజలు చేశారు. ఆనందోత్సాహాలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. బంజారాల కులదైవమైన సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వహణ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మోతిలాల్, తుకారాం, ప్రేమ్‌లాల్, ప్రేమ్‌కుమార్, ప్రకాశ్, సంతోశ్‌నాయక్, రవీందర్‌నాయక్, చాంగుబాయి పాల్గొన్నారు.