తీజ్‌ ఉత్సవాలు | Teej celebrations | Sakshi
Sakshi News home page

తీజ్‌ ఉత్సవాలు

Published Sat, Jul 23 2016 10:48 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

తీజ్‌ ఉత్సవాలు - Sakshi

తీజ్‌ ఉత్సవాలు

నిజామాబాద్‌ కల్చరల్‌ : బంజారాల సంప్రదాయ పండుగ తీజ్‌ శనివారం నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఇందుకు వేదికైంది. బంజారా తీజ్‌ ఉత్సవం–2016 పేరుతో తీజ్‌ ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 300 మంది మహిళలు, యువతులు వెదురుబుట్టలలో గోధుమ విత్తనాలు నాటి, ప్రత్యేక పూజలు చేశారు. ఆనందోత్సాహాలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. బంజారాల కులదైవమైన సేవాలాల్‌ మహారాజ్, జగదాంబదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వహణ కమిటీ ప్రతినిధులు డాక్టర్‌ మోతిలాల్, తుకారాం, ప్రేమ్‌లాల్,  ప్రేమ్‌కుమార్, ప్రకాశ్, సంతోశ్‌నాయక్, రవీందర్‌నాయక్, చాంగుబాయి పాల్గొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement